ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజాప్రతినిధులు అందరికీ ఒక పిలుపునిచ్చాడు. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని.. ఆ గ్రామాల అభివృద్దికి పాటు పడాలని మోడీ వారిని కోరాడు. తన మంత్రివర్గంలోని మంత్రులకు, తమ పార్టీ ఎంపీలకు ఈ విజ్ఞప్తిని చేయడంతో పాటు.. ఈ విషయంలోచొరవ తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ మోడీ లేఖ రాశాడట. ఈ విషయంలో కొంతమంది సానుకూలంగా స్పందిస్తున్నారు. తమిళనాడులోని డీఎంకే వాళ్లు మోడీ పిలుపుకు అనుగుణంగా గ్రామాలను దత్తత తీసుకొనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. మరి భారతీయ జనతాపార్టీతో అంత సఖ్యతలేని డీఎంకే వాళ్లే మోడీ పిలుపుకు అనుగుణంగా స్పందించడం మొదలు పెట్టారు. అయితే ఈ విషయంలోఏపీ తరపు నుంచి మాత్రం ఇంత వరకూ స్పందన లేదట. ఏపీ ముఖ్యమంత్రిచ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తమ పార్టీ ఎంపీలుకు, ఎమ్మెల్యేలకు ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదట. ప్రధానమంత్రి నుంచి లేఖ వచ్చి నెల రోజులు అవుతున్నా.. ఏపీ ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించలేదట. ఇటు ప్రభుత్వం పరంగా కానీ, అటు పార్టీ పరంగా గానీ చంద్రబాబు నాయుడు స్పందించడం లేదని... మరి అన్ని విషయాల్లోనూ మోడీని ఆదర్శంగా తీసుకొనే తెలుగుదేశం అధ్యక్షుడు ఈ వ్యవహారంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదో.. అనే అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయిప్పుడు!

మరింత సమాచారం తెలుసుకోండి: