బిజెపిలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు ఆధిపత్యం ఇటీవలి కాలంలో మరింతగా పెరుగుతూ వస్తోంది. ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న రాజకీయ నియామకాలు, పరిణామాలు ఈ అంశాన్ని స్పష్టం చేస్తు న్నాయి. ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో అధికారిక బిజెపిలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర తెరవెనుక, తెరపైనా ప్రత్య క్షమవుతోంది. హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్‌ కట్టర్‌ను నియమించడం ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్రను తెలియ చేస్తోంది. కట్టర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి నేరుగా దిగుమతి అయిన వారే. ఇక బిజెపి సంస్థాగత విషయాలలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక పాత్ర బలపడుతోంది. పార్టీ అధ్యక్షులు అమిత్‌షా నియమించిన ప్రధాన కార్యదర్శుల జట్టులో ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులే ఎక్కువగా ఉన్నారు. నరేంద్ర మోడీ ఈ నెల తొమ్మిదిన తమ మంత్రివర్గాన్ని విస్తరించిన తరువాత పార్టీలో ఆర్‌ఎస్‌ఎస్‌ రూపం మరిం తగా వెల్లడయింది. పార్టీలోకి సంఫ్‌ు ప్రతినిధులను, కొందరు మాజీ ప్రచారక్‌లను తీసుకున్నారు. వారే ఇప్పుడు అమిత్‌ షా ఆధ్వర్యంలో పార్టీ వ్యవహారాలను నిర్వహి స్తున్నారు. సంఫ్‌ుపరివార్‌కు బిజెపి ఓ రాజకీయ విభాగం గా ఉంటూ వస్తోంది. దీనితో బిజెపిలో ఎప్పుడూ ప్రముఖ నేతలు ఎక్కువగా ఆర్‌ఎస్‌ఎస్‌ పూర్వరంగపు వారే ఉండటం గమనార్హం. ఎన్డీఏ ప్రధాన మంత్రులు ఆర్‌ఎస్‌ఎస్‌ పూర్వానుభవం వారే. అయితే పార్టీ రోజువారి కార్యకలా పాలను ఇంతకుముందెన్నడూ లేని రీతిలో సంఫ్‌ు తన చెప్పుచేతల్లో పెట్టుకుని నడిపిస్తోంది. పార్టీపై సంఫ్‌ు ఆధిపత్యం, ప్రభావం అపూర్వంగా ఉందని పార్టీలోని వారే అంగీకరిస్తున్నారు. బిజెపిలో ఇప్పుడు ఐదుగురు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. వారిలో రామ్‌ మాధవ్‌, రాంలాల్‌, పి మురళీధర్‌ రావులను ఆర్‌ఎస్‌ఎస్‌ నేరుగా బిజెపి పదవులలోకి పంపించింది. ఇక మిగిలిన ఇద్దరిలో భూపేందర్‌ యాదవ్‌, సరోజ్‌ పాండేలకు ఆర్‌ఎస్‌ఎస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిజానికి ఇందులో యాదవ్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి తొలుత భారతీయ అదివక్త పరిషత్‌లోకి తీసుకున్నారు. ఇది సంఫ్‌ు న్యాయవాదుల వేదికగా ఉంది. అక్కడి నుంచి ఆయనను బిజెపిలోకి పంపించారు. 2012 ఏప్రిల్‌లో రాజ్యసభ టికెటు ఇచ్చారు. ఇప్పుడు ప్రధాన కార్య దర్శిగా నియమించారు. మాధవ్‌ జులైలో ఈ పదవిలోకి వచ్చారు. అంతకు ముందు ఆయన ఆర్‌ఎస్‌ ఎస్‌ అధికార ప్రతినిధిగా వ్యవహ రించారు. ఇక మురళీధర్‌రావు ఆర్‌ఎస్‌ఎస్‌లో చాలాకాలం కీలక పాత్ర పోషించారు. ఆయనను బిజెపిలోకి 2009లో తీసుకు వచ్చారు. అప్పట్లో పార్టీ అధ్యక్షులు రాజ్‌నాథ్‌ సింగ్‌కు సహాయకుడిగా ఉన్నారు. రాంలాల్‌ 2006లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌కు పార్టీలో కీలక బాధ్యత కోసమే ఈ పదవిని ఆయనకు కట్టబెట్టారు. సంఫ్‌ుకు, బిజెపికి మధ్య వారధిగా ఉండేం దుకు ఆయనను ప్రత్యేకంగా నియమించారు. ఇప్పుడు అమిత్‌షా పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత పార్టీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య ఇలాంటి వారధి వంటి సారథులు పలువురు దూసుకువచ్చారు. పార్టీలో నలుగురు ప్రధాన కార్యదర్శులను నియమించిన తొలి బిజెపి అధ్యక్షులు అమిత్‌ షా కావడం గమనార్హం. ఇదంతా కూడా ఆయన ఎక్కువ మంది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు తీసుకున్న నిర్ణయాలలో భాగమే. ఆయన పార్టీలోకి తీసుకున్న వారిలో వి సతీష్‌, సౌదన్‌ సింగ్‌, శివ్‌ ప్రకాశ్‌, బిఎల్‌ సంతోష్‌లు ఆర్‌ఎస్‌ఎస్‌ క్షేత్ర ప్రచా రక్‌లుగా పనిచేశారు. వారిని ఆగస్టులో పార్టీ పదవుల్లోకి తీసుకున్నారు. పార్టీలోకి ఆగస్టులో వచ్చిన ప్రకాశ్‌ ఉత్తరప్రదేశ్‌, ఉత్తరఖండ్‌లలో ప్రచారక్‌గా పనిచేశారు. అమిత్‌ షా తీసుకుంటున్న నిర్ణయాలలో భాగంగా మాధవ్‌కు పార్టీ తరఫున పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి పార్లమెంటరీ బోర్డులో చోటు దక్కబోతోంది.  ఇక జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ప్రచార నిర్వాహకుడిగా యాదవ్‌ను తీసుకున్నారు. రావును తమిళనాడు పార్టీ బాధ్యతలను ఇప్పుడున్న కర్నాటకతో పాటు చూసుకోమని తెలిపారు. పలువురు పార్టీ కార్యవర్గ సభ్యులు ఇప్పుడు మంత్రులుగా నియమితులు కావ డంతో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయడానికి అమిత్‌ షా తొందరపడటం లేదు. 'ప్రస్తుతానికి మేం సభ్యత్వ సేకరణపై దృష్టి సారించాం. అలాగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగం అయ్యాం. డిసెంబర్‌ 23వరకూ పార్టీలో నూతన నియామకాలు ఉండ బోవనే భావించాలి' అని పార్టీ నాయకులు ఒకరు తెలిపారు. గుజరాత్‌ రాష్ట్ర రాజకీయాల నుంచి అమిత్‌ షాను మోడీ ఏరికోరి తీసుకువచ్చి, తొలుత యుపి పార్టీ వ్యవహారాల బాధ్యతలు అప్పగించి ఆ తరువాత పార్టీ అధ్యక్ష స్థానానికి పదోన్నతి కల్పించిన నాటి నుంచి కీలక పరిణామాలు జరుగుతూ వచ్చాయి. ఆయన ఎన్నికలలో పార్టీ ప్రచార బాధ్యతలు, పార్టీ వ్యవహారాల నిర్వహణకు ఎక్కువగా సంఫ్‌ు వ్యక్తుల పైనే ఆధారపడుతూ వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి సునీల్‌బన్సల్‌ను లక్నో లోని పార్టీ ప్రచారవిభాగానికి నిర్వాహకులుగా తర లించారు. షా పార్టీ పగ్గాలు చేపట్టగానే బన్సల్‌ను యుపిలో కీలకనేతగా ఎంచుకున్నారు. 2014 లోక్‌ సభ ఎన్నికలలో బిజెపి విజయానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కేడర్‌ వ్యవస్థ ఉత్ప్రేరకంగా పనిచేసిందని పార్టీ ప్రముఖులు విశ్వసిస్తున్నారు.దీనితో ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా పార్టీ ప్రభావం, ఆధిక్యత పెరుగుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: