తెలంగాణ అసెంబ్లీలో రేవంత్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇక భవిష్యత్‌లోను ఉండదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పొరుగు రాష్ట్రం శాసససభ్యుడు అన్నచందంగా వ్యవహారిస్తోంది సర్కారు. రేవంత్‌ భవిష్యత్‌లోను మాట్లాడే అవకాశం ఉండక పోవచ్చునని టిఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలోను వినిపిస్తోంది. ఆయన గొంతు నొక్కాలనే వ్యూహాం రూపొందించినట్లు గులాబీ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే రోజుకు ఒక్క వ్యూహాన్ని అమలు చేస్తోందని రాజకీయవర్గాల్లో వాదన వినిపిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశంపార్టీ వాణిని బలంగా వినిపిస్తున్న నేతల్లో రేవంత్‌ రెడ్డి పేరు ప్రముఖంగా ఉంది. టిఆర్‌ఎస్‌పార్టీపై ఘాటైన విమర్శలు చేయడంలో రేవంత్‌ సిద్దహస్తుడు. మోత్కుపల్లి నర్సింహాలు, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంకా చాలమంది నేతలు టిఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడంలో తమ ఉనికిని చాటుకుంటున్నా రేవంత్‌రెడ్డి స్టైలేవేరు. తన వద్ద ఆధారాలువున్నాయంటే ఏవో డాక్యుమెంట్లు ముందేసుకుని మాట్లాడుతుంటారాయన. వాటి ప్రదర్శనతో ప్రత్యర్ధులను ఇరుకున పెట్టడంలో రేవంత్‌ తీరే వేరు. నిజామాబాద్‌ ఎంపి కవిత సమగ్ర సర్వే సందర్భంగా రెండు చోట్ల తన పేరు నమోదు చేయించుకున్నారని రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. దానికి తోడు మెట్రోభూమల వివాదంపై రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు తెలంగాణ సర్కారును ఇరకాటంలో పడేశాయి. ఏకంగా రేవంత్‌ చేసిన ఆరోపణలపై సిఎం కెసిఆర్‌ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది.  మైహోమ్‌ రామేశ్వరావుకు భూబదలాయింపుపై ఏకంగా సర్కారును మూడు చెరువులు నీళ్లుతాగించి ముప్పతిప్పలు పెట్టారు. తెలంగాణ విద్యుత్‌ సమస్యపై సర్కారును రేవంత్‌రెడ్డి నిలదీసిన వైనం ప్రజల్లో మంచిపేరు తెచ్చిపెట్టింది.విద్యుత్‌కు సర్కారు నిర్లక్ష్యమేన్న భావన ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లారు. చత్తీస్‌ఘడ్‌ ఒప్పందాల వెనకు ఉన్న రహస్యాన్ని సైతం ఎండగట్టారు. రేవంత్‌ వాఖ్యలు టిఆర్‌ఎస్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. రేవంత్‌ నోరు మూయించాలనే లక్ష్యంతో ఆయన అన్ని అబద్దాలు చెబుతారనే ముద్ర వేసింది. వాస్తవాలు చెబితే తమను లక్ష్యంగా చేసుకుని టిఆర్‌ఎస్‌ వ్యక్తిగత విమర్శలు చేస్తోందని ఆరోపణ అస్త్రాలను రేవంత్‌ సంధించారు.సభలో అధికారపార్టీని నిలదీసినందుకు వారం రోజులపాటు సస్సెండ్‌ సైతం చేశారు. ఇది ప్రజా సామ్యపద్దతా? అన్న వాదన పక్కన పెడితే రేవంత్‌రెడ్డికి ఎప్పుడు మాట్లాడే అవకాశం వచ్చినా, అతన్ని మాట్లాడనివ్వకూడదంటూ అధికారపార్టీ ఆందోళన షురూ చేస్తూ అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. రేవంత్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే టిఆర్‌ఎస్‌ అలా చేస్తోందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. గురువారం రోజు సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఆయన ఆవేశంగా ఊగిపోయారు. హెడ్‌ఫోన్స్‌ నేలకు విసిరికొట్టి స్పీకర్‌ పోడియం వైపుకు దూసుకుపోయారట. ఇదో కొత్త వివాదం. ఈఘటన పేరు చెప్పి, సభ నుంచి మారోమారు రేవంత్‌రెడ్డిని బయటకు పంపేందుకు అధికారపార్టీకి అవకాశం దొరికింది. కానీ రేవంత్‌ను సస్పెండ్‌చేస్తే బయట మరింత పాపులర్‌ అవుతారనే భావించిన టిఆర్‌ఎస్‌పార్టీ అవకాశాన్ని వదిలి వేసింది. తాజాగా శుక్రవారం రేవంత్‌రెడ్డి అవకాశమే దక్కడం లేదు. బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్ప్పటికీ,రేవంత్‌రెడ్డి పదేపదే అధికారపార్టీ అడ్డుకుంటోంది. రికార్డుల్లో బూట్లు నాకుతున్నారు. అనే ప్రస్తావన ఉంది అని సిఎం కెసిఆర్‌ చెప్పగా, స్పీకర్‌ మధుసూధనచారి కూడా ఆవిషయాన్ని దృవీకరించారు. రేవంత్‌రెడ్డి అనుచిత వాఖ్యలు చేస్తే,దానిపైమీరు నిర్ణయం తీసుకొండి ఏ శిక్ష విధించినా కట్టుబడి వుంటాం అని టిడిపి ఫ్లోరు లీడర ఎర్రబెల్లి దయాకర్‌రావు వాఖ్యానించారు. అయితే నేను శిక్షించడానికి కోసం కాదు ఉన్నది అని స్పీకర్‌ వివరణ ఇచ్చారు. రేవంత్‌రెడ్డికి మాట్లాడేందుకు అవకాశం దక్కలేదని స్పీకర్‌ చొరవ చూపాలని టిడిపి కోరింది. అయినా రేవంత్‌ మాట్లాడేందుకు టిఆర్‌ఎస్‌ సభ్యులు అనుమతించక పోవడంతో వ్యతిరేకంగా సభలో గందరగోళం తలెత్తడం జరిగాయి. టిడిపి వాకౌట్‌ చేసింది. ఈసెషన్‌ పరిస్ధితి ఇలావుంటే,తదుపరి సమావేశాలకు రేవంత్‌రెడ్డి హాజరయినా, ఆయన్ను మాట్లాడినిస్తారా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. సభలో మాట్లాడే అవకాశం రానప్పుడు ఎంఎల్‌ఏ పదవి వున్నా లేనట్టే కాదా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: