"వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమ్మక్కయ్యారు. ఓ రహస్య ఒప్పందానికి వచ్చారు. టీడీపీని తొక్కేయాలని ప్లాన్ చేస్తున్నారు.." ఇవీ సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగు దేశం నేతలు విచ్చలవిడిగా చేసిన ఆరోపణలు. ఆ ఆరోపణలకు తగినట్టుగానే.. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఎప్పడూ సీరియస్ గా విమర్శలు చేసుకోలేదు. ఒక పార్టీని మరో పార్టీ తమ రాజకీయ ప్రత్యర్థిగా ఫీలవలేదు. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ టీడీపీని ప్రధాన శత్రువుగా భావించారు. శత్రువు, శత్రువు మిత్రుడు అన్న సూత్రం ప్రకారం.. వీరి మధ్య ఓ అండర్ స్టాండింగ్ కుదిరిందని అప్పట్లో చాలా మంది నమ్మారు.                                    ఎన్నికల తర్వాత తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే.. అక్కడ జగన్ చతికిలపడ్డాడు. ఆ తర్వాత జగన్ దాదాపుగా తెలంగాణపై ఆశలు వదిలేసుకున్నాడు. నామ్ కే వాస్తేగా చెల్లి షర్మిలకు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎప్పుడూ కేసీఆర్ పై డైరెక్టుగా విమర్శలు చేయలేదు. అటు కేసీఆర్ అండ్ టీమ్ కూడా అంతే. ఐతే కేసీఆర్, జగన్ ల మధ్య రహస్య ఒప్పందం ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతోందా.. ? అందుకే ఇద్దరు నేతలు సైలంటయ్యారా.. అన్న ప్రశ్నలకు సమాధానం తేలాల్సి ఉంది.                      ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ 108 సర్వీసు గురించి చేసిన కామెంట్లు.. మరోసారి ఆసక్తికర చర్చకు తెరలేపాయి. వైఎస్ హయాంలో 108 సర్వీసులు బాగా పనిచేశాయని అసెంబ్లీ సాక్షిగా కితాబిచ్చారు. అందుకు ఉదాహరణగా... తెలంగాణ ఉద్యమ సందర్భంగా తాను ఒకసారి పరకాల వెళ్తున్నప్పుడు జరిగిన ఘటనను గుర్తుచేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఓ మనిషి పడిపోతే... అక్కడున్న పిల్లలు కూడా 10 నిమిషాల్లో 108 వస్తుందని ధీమాగా చెప్పారన్నారు. ఆ సర్వీసు పట్ల జనంలో ఉన్న విశ్వాసాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని కేసీఆర్ చెప్పారట. కేసీఆర్ వైఎస్ ను పొగటం చూస్తే చాలు .. జగన్ తో ఆయన కుమ్మక్కు వ్యవహారం ఇట్టే తెలిసిపోతుందంటున్నారు కొందరు విశ్లేషకులు

మరింత సమాచారం తెలుసుకోండి: