ఎపిలో రుణ మాఫీ జాబితాలపై గందరగోళం ఆరంభమైంది.రకరకాల వడపోతల తర్వాత బ్యాంకులకు ప్రబుత్వం అర్హులైన వారి జాబితాను తిరిగి బ్యాంకులకు పంపింది. మొదట బ్యాంకుల ద్వారానే ప్రబుత్వం ఈ జాబితాను తెప్పించుకుంది. ఆ తర్వాత ఆదార్ కార్డు,రేషన్ కార్డు, కుటుంబానికి ఒకరే ఇలా రకరకాల నిబంధనలు పెడుతూ వచ్చింది. కారణం ఏమైనా ఇప్పుడు బ్యాంకులలో ఉన్న రైతుల ఖాతాలు అన్నిటికి రుణమాఫీ వర్తింప చేయకపోవడం తో సమస్యలు వచ్చే అవకాశం ఏర్పడింది. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో ఒక సహకార సంఘంలో 650 ఖాతాలు ఉంటే రెండువందల పేర్లే అర్హుల జాబితాలో వచ్చాయట. అలాగే కర్నూలు జిల్లా ఆత్మకూరు గ్రామీణ బ్యాంకులో 1300 ఖాతాలకు గాను 700 పేర్లు మాత్రమే అర్హమైన జాబాతాలో ఉండడం రైతులలో ఆందోళన కలిగిస్తోంది.వినుకొండ లో ఒక బ్యాంకు శాఖలో 3600 పేర్లకు గాను, 2400 పేర్లే ఖరారయ్యాయి. మరో శాఖలో అయితే కేవలం ఏభై మంది జాబితానే వచ్చిందని సమాచారం. ఈ నేపధ్యంలో రైతులలో గందరగోళం ఏర్పడిందని కధనం. దీనిపై తుది జాబితాలో సరిచేయవచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: