కచ్చితంగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే బీయాస్ లో తెలుగు విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విహారయాత్రకని వెళ్లి అక్కడ దురదృష్టవశాత్తూ జల ప్రవాహానికి బలయ్యారు. ఇంజనీరింగ్ చదువుతున్న వారికి అలాంటి ప్రమాదం ముందుకు రావడంతో దేశం యావత్తూ కదిలిపోయింది. వారందరి పట్ల సానుభూతిని ప్రకటించింది. అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడటంతో తెలుగు విద్యార్థులను సంరక్షించుకోవడానికి వారి క్షేమ సమాచారాలను చేరవేయడం గురించి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ బాగానే స్పందించాయి. తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్వయంగా సంఘటన స్థలానికి వెళ్లాడు. అక్కడి అధికారులతో మాట్లాడి సహాయ కార్యక్రమాలు త్వరగా జరిగేటట్లు చూశాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు స్పందించి మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించాయి. అయితే దాన్ని బాధితులకు అందజేయడం మాత్రం బాగా లేటయ్యింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... బియాస్ నదీ ప్రమాద బాధితులైన విద్యార్థులకు ఎట్టకేలకూ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిహారాన్ని చెక్కుల రూపంలో అందించాడు! సహాయ కార్యక్రమం అనేది ఇన్ని రోజుల తర్వాత చేపట్టడమా! అనే ఆశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయిప్పుడు. మరి లేటుగా అయినా సరే.. ఇచ్చారు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: