రెండు పడవల ప్రయాణం అసలుకే ఎసరు తెస్తుందనుకున్నాడో ఏమో కానీ జగన్.. మొదటి నుంచి ఆంధ్రాపైనే దృష్టి సారించాడు. చంద్రబాబు తరహాలో రెండు కళ్ల సిద్దాంతం కాకుండా.. రాష్ట్రవిభజనకు ముందే తాను ఆంధ్రాపక్షమని తేల్చిచెప్పేశాడు. సమైక్యశంఖారావమంటూ హడావిడి చేశాడు. ఐనా అనుకున్నంత ఫలితం దక్కలేదు. తెలంగాణలో ఆ పార్టీకి ఆదరణ పూర్తిగా కరవైనా.. ఖమ్మం జిల్లాలో మాత్రం.. అనూహ్యంగా ఓ ఎంపీ.. మూడు అసెంబ్లీ సీట్లు వచ్చాయి.                                   ఎందుకైనా మంచిదని చెల్లెలు షర్మిలకు తెలంగాణ పగ్గాలు అప్పగించి రాజకీయంగా ఓ మంచి స్టెప్ వేశానని అనుకుంటున్న జగన్ కు ఫలితాలు మాత్రం అంత ఆశాజనకంగా లేవు.. పరామర్శ పేరుతో షర్మిల పంచే సెంటిమెంట్ తో తెలంగాణలో పార్టీ పుంజుకుంటుందని ఎక్స్ పెక్ట్ చేసినా.. అలాంటి సంకేతాలు ఏమీ కనిపించడం లేదు. పుంజుకోవడం సంగతి అటుంచితే.. ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా.. షర్మిల యాత్ర చేస్తున్న సమయంలోనే పార్టీకి దూరమవడం విశేషం. తెలంగాణ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి దూరమయ్యారు.                     ప్రజాప్రతినిధులకుతోడు.. నాయకులు కూడా పార్టీకి దూరమవుతున్నారు. జనక ప్రసాద్ వంటి నేతలు.. పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఏకంగా ఆయన కూడా పక్కచూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా గులాబీ తీర్ధం పుచ్చుకుంటే..ఇక తెలంగాణలో ఆ పార్టీ తరపున చట్టసభల్లో గొంతు వినిపించే అవకాశమే ఉండదు. దీన్ని బట్టి చూస్తే... జగనన్న విసిరిన బాణం.. తుస్సుమన్నట్టే లెక్క.

మరింత సమాచారం తెలుసుకోండి: