అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన జీఎస్ ఎల్ వీ మార్క్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. గురువారం ఉదయం 9.30 గంటలకు నింగిలోకి వెళ్లిన ఈ రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్‌ (వ్యోమగాముల గది)ను అమర్చినట్లు ఇస్త్రో శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తం జీఎస్ఎల్వీ-3 రాకెట్ బరువు 630. 58 టన్నులు. ఇది కేవలం ప్రయోగాత్మకమైనదేనని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగానికి రూ.155 కోట్ల వ్యయం అయ్యిందని స్పష్టం చేశారు. 3,735 కిలలో బరువు, 43.43 మీటర్ల ఎత్తు ఉన్న వ్యోమగాముల గదిని ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. భూమి నుంచి 126.15 కిలోమీటర్లు పైకి వెళ్లిన తరువాత దీనిని రాకెట్ వదిలేస్తుంది. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూమికి చేరుకోనుంది. అండమాన్ కు సమీపంలోని సముద్రం వద్ద దీనిని తీసుకునేందుకు ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భవిష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే క్రమంలోనే జీఎస్ఎల్ వీ మార్క్-3 ని ప్రయోగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: