మత మార్పిడుల పైన విపక్షాలు ఆరోపణలు చేస్తుండటంపై ప్రధాని నరేంద్ర మోడీ మంత్రులకు ధైర్యమిచ్చారని తెలుస్తోంది. మనం ఎలాంటి తప్పు చేయలేదని, భయపడాల్సిన పనిలేదని ఆయన వారికి సూచించారని సమాచారం. మత మార్పిడులంటూ చెలరేగుతున్న నేపథ్యంలో పార్లమెంట్‌లో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడాల్సిన అవసరమేమీ లేదనీ ఆయన బుధవారం తనను కలిసిన కొంతమంది మంత్రులకు సూచించారని చెబుతున్నారు. మనమేమీ తప్పు చేయనప్పుడు మనమెందుకు కలవరబడాలని ఆయన మంత్రులతో అన్నట్లుగా చెబుతున్నారు. ఉభయసభలలో ప్రభుత్వం దూకుడు వైఖరి కొనసాగించడమే మేలని ప్రధాని వారికి సూచించారంటున్నారు. పెచ్చరిల్లుతున్న మతఘర్షణలపై చర్చకు మోడీ రాజ్యసభకు వచ్చి సమాధానమివ్వాలనీ, అంతవరకు సభా కార్యకలాపాలు సాగనివ్వబోమంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: