అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు.. సభలో జగన్ ప్రవర్తన అంత హుందాగా లేదు. తొలిరోజు.. అందులోనూ.. ఓ ఎమ్మెల్యే సంతాప తీర్మానం సందర్భంగా సభ్యులు మాట్లాడుతున్న సమయంలో.. ప్రతిపక్ష నేతనైన తనకు రెండో అవకాశం ఇవ్వలేదంటూ ఆయన స్పీకర్ పై రంకెలేయడం చూపరులకు అంత సబబుగా అనిపించలేదు. సభ ప్రారంభం కాగానే.. ఎమ్మెల్యే వెంకటరమణ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం తెలుపుతూ మాట్లాడారు. ఆయన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడారు.                                   ఇంకో సభ్యుడు మాట్లాడుతున్న సమయంలో జగన్ ఆవేశంగా లేచారు. ప్రతిపక్ష నేతను కావాలని కోడెల అవమానపరుస్తున్నారని ఫైరయ్యారు. ముఖ్యమంత్రి తర్వాత తనకు మైకు ఇవ్వకుండా కావాలనే పక్షపాతం చూపుతున్నారని మండిపడ్డారు. ఈ విమర్శలతో కోడెల అవాక్కయ్యారు. వాస్తవానికి ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఆయన జగన్ వైపు చూశారు. జగన్ లేవలేదు. ఇంతలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడటం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మాట్లాడమని జగన్ పురమాయించారేమో అనుకుని కోడెల సైలంటయ్యారు.                                 ఒకవేళ కోడెల ఉద్దేశపూర్వకంగానే జగన్ ను విస్మరించి ఉంటే.. ఆయన మైక్ అడిగి ఉండాల్సింది.. అలా కాకుండా వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడిన తర్వాత అభ్యంతరం చెప్పడం అంత సబబుగా కనిపించలేదు. ఒక వేళ స్పీకర్ కోడెల పొరపాటు చేసినా.. ఆ స్థాయిలో విమర్శించాల్సిన సందర్భం కాదు.. సంతాప తీర్మానం నేపథ్యంలో అసలే మంచిది కాదు. జగన్ ఇలా ఊరికే టెంప్ట్ అయిపోయి.. సభలో శివాలెత్తిపోతే.. ఈ వీక్ నెస్ అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు ఆయన్ని ఓ ఆటాడుకునే ప్రమాదం ఉంది. సమయం సందర్భం చూసుకుని జగన్ కాస్త సంయమనం వహిస్తే బావుంటుందంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: