ఇంటర్ నెట్ రాకతో ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేసింది. వేలికొనలతో టైప్ చేస్తే చాలు.. చిటికెలో కావలసిన సమాచారం లభిస్తుంది. జీవితకాలమంతా చూస్తూనే ఉన్నా.. తరగనంత సమాచారం ఇంటర్ నెట్లో ఉంది. మరి ఆ విస్తృత సమాచారంలో జనం ఏ ఏ అంశాల కోసం ఎక్కువగా వెదుకుతున్నారు. రాజకీయ నాయకులు, సినీతారలు, సినిమాలు.. ఆన్ లైన్ షాపింగ్.. ఇలా విభిన్న అంశాల్లో జనం ఎక్కువగా ఏ సమాచారం కోరుకుంటున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు గూగుల్ చేసిన ప్రయత్నం ఆసక్తికర ఫలితాలు వెల్లడించింది.                                             గూగుల్ ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువగా శోధించిన అంశాలను టాప్ టెన్ రూపంలో ప్రకటించింది. అందులో నెట్లో ఎక్కువగా ఎవరికోసం వెదికారన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ కంటే ఎక్కువగా నీలి చిత్రాల శృంగార తార సన్నీలియోన్ కోసం నెటిజన్లు వెదకడం విశేషం. వ్యక్తుల కేటగిరీలో సన్నీది మొదటి స్థానం కాగా..మోడీ రెండోస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా.. సల్మాన్, కత్రినా, దీపికా, ఆలియా, ప్రియాంకా, షారుఖ్,పూనం పాండే, విరాట్ కోహ్లీ ఉన్నారు. నెటిజన్లు ఎక్కువగా వెదికి వ్యక్తుల్లో మోడీ, విరాట్ తప్ప అంతా సినీనటులే కావడం విశేషం.                                          ఇక ఎక్కువగా నెటిజన్లు చూసిన వెబ్ సైట్ల వివరాల్లోకి వస్తే.. ఇండియన్ రైల్వేకి సంబంధించిన వెబ్ సైట్ ఐఆర్ సీటీసీ ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. ఆ తర్వాత ఫ్లిప్ కార్డ్, ఎస్ బీఐ ఆన్ లైన్, స్నాప్ డీల్ ఉన్నాయి. ఫోన్ల విషయానికి వస్తే మోటో జీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఫోన్ 6, శ్యాంసంగ్ గ్యాలక్సీ ఎస్ 5 మోటో ఈ ఉన్నాయి. మరో ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటంటే.. ఉమ్మడి ఏపీ విషయానికి వస్తే.. రాజకీయ నాయకుల్లో చంద్రబాబు గురించే ఎక్కవగా వెదికారు. ఆ తర్వాత స్థానంలో కేసీఆర్ ఉన్నారు. ఐతే.. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. చంద్రబాబు కంటే కేసీఆర్ గురించే ఎక్కువగా వెదికారట.

మరింత సమాచారం తెలుసుకోండి: