నవ్యాంధ్ర పాలనా వ్యవస్థను విజయవాడ నుంచే నిర్వహిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు హైదరాబాద్‌ కొనసాగినప్పటికీ అక్కడి నుంచి పాలనాపరమైన నిర్ణయాలు, విధి విధానాలు ప్రకటించటంవల్ల సీమాంధ్ర ప్రజలకు ప్రభుత్వానికి దూరం పెరుగుతోందనే భావనతో ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెనువెంటనే విజయవాడను తాత్కాలిక రాజధానిగా సీఎం ప్రకటించారు. ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలని ఆదేశించారు. తన క్యాంప్‌ కార్యా లయంతో పాటు నివాసానికి అనువుగా ఉన్న భవనాలు, స్థలాలను ఇప్పటికే సీఎం పరిశీలించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అధికారులతో తరచు విజయవాడలో సమావేశం నిర్వహించే కంటే నగరానికే ప్రధాన కార్యాలయాలు తరలించి తన క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి విధులు నిర్వహిస్తే అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులపై కూడా పర్యవేక్షణ ఉంటుందని ఇకపై నిర్లక్ష్యం వహించటం మంచిదికాదని మంత్రి వర్గ సహచరులతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం. రాష్ట్ర ప్రధానకార్యా లయాల్లో ఇరిగేషన్‌, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రులు తమ క్యాంప్‌ కార్యాలయాలను విజయవాడలోనే ఏర్పాటు చేసుకున్నారు. జలసౌధ నిర్మాణానికి కూడా కసరత్తు జరుగుతోంది. నీటిపారుదల కార్యాలయం ఆవరణలోనే జలసౌధ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం సిబ్బంది క్వార్టర్లను ఖాళీ చేయా లని కూడా ఆదేశాలు అందాయి. ఇదిలా ఉండగా గన్నవరం మేథాటవర్స్‌కు కొన్ని శాఖలు తరలించనున్నారు. విమానా శ్రయానికి చేరువలోనే ఉన్న వెటరినరీ ఆసుపత్రిలో రాష్ట్ర రైతు సాధికారత మిషన్‌ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఇందులో వ్యవసాయశాఖ ప్రధాన కార్యాలయం ఏర్పాటులో సాధ్యాసాధ్యాలను ఇప్పటికే అధికారుల నడిగి తెలుసుకున్నా రు. ఇదిలా ఉండగా విజయవాడ నగరంలోని బందరు రోడ్డులో పలు ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, ఖాళీ స్థలాలు ఉన్నాయి.. వీటిని ఏరకంగా ఉపయోగించుకోవచ్చనే అంశంపై కలెక్టర్‌ నివేదిక కోరారు. గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శాసనసభ శీతాకాల సమా వేశాల నిర్వహణకు ప్రయత్నించారు. అయితే కొన్ని మరమ్మ తులు, వాస్తు రీత్యా హైదరాబాద్‌లోనే నిర్వహించాల్సి వచ్చిం దని అధికార పార్టీ ఎమ్మెల్యేలు వివరించారు. అయితే విశ్వ విద్యాలయంలో కొన్ని కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. కీలకమైన ప్రభుత్వ శాఖలు హౌసింగ్‌, వ్యవసాయం, విద్యాశాఖ కార్యాలయాలను వర్శిటీకి తరలించాలని నిర్ణయించారు. ఇక మంగళగిరి ఏపీ ఎస్పీ బెటాలియన్‌ ఆవరణలో పోలీసు డీజీపీ కార్యాలయాన్ని తరలించటం దాదాపు ఖరారయింది. అగ్నిమాపక, ప్రకృతి విపత్తులశాఖకు సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇక సాధారణ పాలనా విభాగంతో పాటు వ్యవసాయశాఖ అనుబంధ విభాగాలు, సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయాల ఏర్పాటుపై సీఎం దృష్టి సారించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ అతిధిగృహానికే క్యాంప్‌ కార్యాలయంగా హంగులు దిద్దాలని సీఎం ఇప్పటికే సూచించారు. ఆయన ఆంతరంగిక వాస్తు సిద్ధాంతి సూచనల మేరకు అతిథిగృహం నుంచి విధులు నిర్వహించాలా లేక మరోచోట రెండెకరాల స్థలంలో భవనాలు నిర్మిస్తే మంచిదా అనే అంశాలను సీఎం పరిశీలిస్తున్నారు. బందరు రోడ్డులోగల ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల క్యాంప్‌ కార్యాలయా లను కూడా రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవా లని భావిస్తున్నారు. బెంజి సర్కిల్‌ వద్ద రెండెకరాలు, పోరంకి లో దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి మరో రెండె కరాలు సీఎం క్యాంప్‌ కార్యాలయ నిర్మాణానికి పరిశీలనలో ఉన్నాయి. వీటితో పాటు గుణదల లో ఏపిీ ట్రాన్స్‌కోకు చెందిన 7 ఎకరాల స్థలం ఉంది. ట్రాన్స్‌కో, జెన్‌కో కార్యాలయాలతో పాటు విద్యుత్‌ సౌధ నిర్మాణం కూడా జరపాలని భావిస్తు న్నారు. ఐటీఐ కళాశాల ఖాళీ స్థలం పరిశీలనలో ఉంది. ఇవికాక పాయకాపురం లో ప్రభుత్వ స్థలం, లెనిన్‌ సెంటర్‌ వద్ద ఎక్సైజ్‌ శాఖ స్థలాలు ఉన్నాయి. ప్రభుత్వ, దేవాదాయ, అటవీశాఖలకు సంబంధించి నగర పరిసరాల్లో ఉన్న భూముల్లో కార్యాల యాల నిర్మాణం చేపట్టి తాత్కాలికంగా రాజధానిని సత్వరమే తరలించేందుకు సీఎం వ్యూహరచన చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌ ఏర్పాటు కానుంది. కొత్త రాజధానికి సంబంధించిన భూ సేకరణ, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ఏ మాత్రం అలసత్వం వహించినా విపక్షాలకు అవకాశమిచ్చినట్లవుతుందని దీన్ని గుర్తించి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిం చాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. మంత్రుల పనితీరును పర్యవేక్షించటంతో పాటు ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు విజయవాడలో తాత్కాలిక ఏర్పా ట్లు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌ లో ఉన్నతాధికారులు, సిబ్బంది తమ పిల్లల విద్యాసంబంధిత విషయాల కారణంగా వచ్చే ఏడాది మార్చి తరువాత ఏర్పాటు చేస్తే తరలి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకు అవసరమైన భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలు, అంచనాలు సిద్ధం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యేలకు, అధికారులను సీఎం ఆదేశించారు. ఒకవైపు తెలంగాణ పార్టీ బాధ్యతలను పర్యవేక్షిస్తూ మరోవైపు ఏపి పాలకపగ్గాలు చేపట్టాల్సి రావటం కష్టతరంగా ఉన్నందున ఇకపై రాజకీయ రాజధానిగా మాత్రమే హైదరాబాద్‌లో గడపాలని చంద్ర బాబు నిర్ణయించారు. మరో ఆరు నెలల్లో సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌ అందితే రాజధాని నిర్మాణానికి పునాదులు వేయవచ్చనే భావనతో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: