తిరుపతి స్ధానానికి జరిగే ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా వెంకట రమణ భార్య సుగుణమ్మకే ఇవ్వాలనే నిర్ణయానికి టిడిపి అధి ష్టానం వచ్చినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని టిడిఎల్‌పి సమావేశంలో ఏపి సి ఎం,టిడిపి అధినేత చంద్రబాబు మనసులో మాటను బయటపెట్టినట్లు సమాచా రం. ప్రజల మనిషిగా పేరొందిన వెంకటరమణ మృతి పార్టీకి తీరనిలోటుగా పే ర్కొన్న బాబు ఆయన ఆశయాలను కొనసాగించే సమర్ధత సుగుణమ్మకే ఉందని అభిప్రాయపడ్డారు.తాను గతంలో చూసిన నాటికి వెంకటరమణ మరణం తరు వాత మాట్లాడిన నాటికి ఆమెలో చాలా తేడాను గమనించామని బాబు పేర్కొన్న ట్లు తెలిసింది. బాబు వాఖ్యలను బట్టి చూస్తే వెంకటరమణ బార్య సుగుణమ్మను బరిలో దించాలని అభిప్రాయంతో ఉన్నట్లు రాజకీయవర్గాల్లో వాదన వినిపిస్తోం ది. 2014సాధారణ ఎన్నికల సమయంలోను వెంకటరమణ ప్రచారంలో కీలక పాత్రపోషించడంతోపాటు ప్రచారాన్ని ముందు ఉండినడిపించారు. వెంకటర మణ ఇంట్లో భారీగా డబ్బు ఉందని ప్రాచరం చేయడంతోపాటు వైకాపా నేతల దాడులను సైతం సమర్ధ వంతంగా తిప్పి కొట్టడంతో సుగుణమ్మ సక్సెస్‌ అయ్యా రు. తిరుపతి పట్టణంలో వైకాపా నేతల దౌర్జన్యాలను అడ్డుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఎన్నికల వేళ టిడిపి మద్దత్తు దారులతో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ధర్నా ను సుగుణ ముందుండి నడిపించడంతో పార్టీ నేతల దృష్టిని ఆకర్షించారు. వెం కట రమణకు అన్ని విధాల చేదోడువాదోడుగా వ్యవహారించిన సుగుణమ్మ ఆ యన విజయానికి కృషి చేశారు. విధివక్రీకరించి ఎన్నికలు జరిగిన ఆరునెలలకే వెంకటరమణ ఆకస్మాత్‌గా మృతి చెందడంతో తిరుపతిస్ధానం ఖాళీ అయ్యింది. ఆస్ధానం నుంచి టిడిపి అభ్యర్ధిగాసుగుణమ్మను నిలబెట్టడమే మేలు అని పార్టీ భావిస్తోంది. ఎవరైన శాసనసభ్యుడు మృతి చెందితే ఆయన కుటుంబ సభ్యులు నిలబడితే ప్రతిపక్షాలు పోటీచేయకూడదనే సాంప్రదయాన్ని దశాబ్ధన్నార కాలం గా వస్తోంది. ఇటీవల మృతిచెందిన తంగిరాల ప్రభాకర్‌రావు, భూమా శోభానా గిరెడ్డి కుటుంబాలకు ఇదే సంస్కృతిని అనుసరింపజేశారు. తంగిరాల సౌమ్య, భూమ ఆఖలప్రియలు ఎంఎల్‌ఏలుగా ఎన్నికైన విషయం విదితమే. ఈ నేప ధ్యంలోనే తిరుపతిలోను సానుభూతితో వెంకటరమణ భార్య సుగుణమ్మనే అ భ్యర్ధి కానున్నారు. ఇతరులను నిలబెడితే ప్రతిపక్ష పార్టీ సైతం బరిలో దిగుతుం ది. ఎన్నికలకు వెళ్లాల్సింటుంది. కాబట్టి రమణ భార్యకే టిక్కెట్‌ ఇస్తే పాత సం స్కృతిని కొనసాగించి బయటపడవచ్చునని అధినేత భావిస్తున్నారు. వారంలోపు దీనిపై పూర్తిస్ధాయిలో నిర్ణ యం తీసుకోవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: