అసెంబ్లీలో వైకాపా తరపున స్టార్ బ్యాట్స్ మెన్ లాంటి వక్తలు తక్కువే. ప్రతిపక్ష నేత జగన్, రోజా, ఇంకా ఒకరిద్దరు తప్ప.. పెద్దగా వాగ్దాటి గొంతు ఉన్నవాళ్లు లేరనే చెప్పాలి. అలాంటిది శుక్రవారం వైకాపా తరపున ఓ కుర్రాడు అదరగొట్టేశాడు. ప్రశ్నోత్తరాల సమయంలో.. నెల్లురు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంపై సాధికారికంగా మాట్లాడాడు. ఫీజులు చెల్పింపుపై ప్రభుత్వ తీరుని ఎండగట్టాడు. దాదాపు ఫీజు బకాయిలు 4వేల 400 కోట్లు ఉంటే.. ప్రభుత్వం 2వేల కోట్లు కూడా చెల్లించలేదని లెక్కలతో సహా వివరించాడు.                               ఎన్నికలకు ముందు ఆధార్ తో సంబంధం లేకుండా ఫీజురీఎంబర్స్ మెంటు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఆధార్ సాకుతో విద్యార్థులను ఇబ్బందిపెడుతోందని జీవీ నెంబర్ ప్రస్తావిస్తూ.. ఆదేశాల నకలు ప్రతులు చూపుతూ నిలదీశాడు. తెలంగాణలో చదువుకుంటున్న ఆంధ్రా విద్యార్థుల సంగతేంటని ప్రశ్నించాడు. తనను అడ్డుకోబోతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జీవో కాపీలే చూపుతున్నానంటూ తీవ్రస్వరంతో మండిపడ్డారు. ప్రపంచంలో అబద్దాలపై డాక్టరేట్ ఇచ్చే యూనివర్శిటీ ఉంటే.. అది మొట్టమొదటగా చంద్రబాబుకే వస్తుందని మండిపడ్డాడు.                        అనిల్ కుమార్ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన మంత్రి రావెల కిషోర్ బాబుకు మాటలు కరవయ్యాయి. సమాధానం చెప్పలేకపోయారో.. వివరాలు అందుబాటులో లేవో తెలియదు కానీ.. సూటిగా సమాధానం చెప్పలేక.. ఎదురుదాడికి దిగారు. వైఎస్ హయాంలో దోచుకున్నారని పాతపాటే పాడారు. వైఎస్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారంటూ విమర్శల దాటి మొదలుపెట్టారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని రావెల డొల్లతనం దీంతో బయటపడింది. ఈ కుర్రాడెవరో.. పాలక పక్షాన్ని.. భలే నిలదీశాడన్న కామెంట్లు జర్నలిస్టు గ్యాలరీ నుంచి వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: