ఒక పక్క ఎపిలో భూసేకరణ చట్టం తో సంబంధం లేకుండా కొత్తగా భూ సమీకరణ అనే కొత్త వివాదానికి తెరదీసి అక్కడి ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కుంటుండగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకొని భూ సేకరణ మార్గదర్శకాలను విడుదల చేసినట్లు కనిపిస్తుంది.భూ పరిహారం, సామాజిక ప్రభావం ,పునరావాసం, మొదలైన అంశాలకు ఈ గైడ్ లైన్స్ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది.ఒక వేళ సేకరించిన భూమిని నిర్దిష్ట ప్రయోజనానికి వాడకపోతే,తిరిగి రైతు లేదా భూ యజమానికి వెనక్కి ఇచ్చే క్లాజ్ కూడా పెట్టడం విశేషం.నిర్వాసితుల అబిప్రాయాలకు పెద్ద పీట వేయాలని కూడా భావించారు.అలాగే ఏ ప్రైవేటు సంస్థ రెండువేల ఎకరాలను మించి సేకరణ చేయరాదన్న నిబంధన కూడా పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: