తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ చక్రాలు ఆగనున్నాయి. దీని వల్ల రాష్ట్ర రవాణా సంస్థకు రోజుకి పది కోట్ల రూపాయలు ఆదాయం కోల్పేయే అవకాశం ఉంది. కాబట్టి సమ్మె దిగవద్దని యాజమాన్యం కోరుతున్నా కూడా తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తాము చేయబోయే సమ్మే ఆపబోమని తెలంగాణా మజ్దూర్ యూనియన్ నేతలు అంటున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాలలో ఈ నెల 23, 24 తేదీలలో ఆర్టీసి సమ్మె సైరన్ మోగించనుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం తమ డిమాండ్లను పరిష్కారిస్తానని మాట ఇవ్వడమే తప్ప పరిష్కరించడానికి ఏమాత్రం ఆశక్తి చూపించడం లేదని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రేయింబవళ్ళు కార్మికులు కష్టపడుతున్నా కూడా సరైన న్యాయం చేయకుండా వారి పొట్టకొట్టే ఆలోచనలో యాజమాన్యం వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.  డబుల్ డ్యూటీలు చేసిన కూడా వారికి ఎటువంటి అలవెన్సులు ఇవ్వడం లేదని, నెలకి మూడు రోజలు లీవ్ గ్రాంట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు రావలసిన బకాయిలను చెల్లించడంలో కూడా యాజమాన్యం తాత్సారం చేస్తోందని, ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయకుండా కార్మికుల నడ్డి విరచడానికే ఆర్టీసి యాజమాన్యం వున్నట్లు కనపడుతోందని టీఎంయు నాయకులు థామస్-రెడ్డి అన్నారు. అయితే ఆర్టీసి ఇప్పటికే నష్టాల్లో వుందని, అటువంటి సమయంలో కార్మికులు సమ్మెకి దిగడం సరికాదని ఆర్టీసి యాజమాన్యం అంటోంది. ఏది ఏమైనా కూడా కార్మికుల సమ్మె వల్ల ఇబ్బందులు పడేది తామే కాబట్టి తమని దృష్టిలో పెట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: