తెలుగు రాష్ట్రాలు చలితో గజగజ వణికిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు శనివారం రాత్రి మరింత తగ్గాయి. ఏపీలోని విశాఖ మన్యం చలి తీవ్రతతో వణికిపోతోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలకు నెలవైన లంబసింగిలో 0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలోని మోదకొండమ్మ పాదాల ప్రాంతం వద్ద అత్యల్పంగా 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ఆదిలాబాద్ లో శనివారం రాత్రి ఉష్షోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. ఇక హైదరాబాద్ లోనూ శనివారం రాత్రి ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల సెల్సియస్ తగ్గడంతో నగరవాసులు వణికిపోయారు. రెండు రాష్ట్రాల్లోని మెజారిటీ ప్రాంతాల్లోనూ శనివారం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: