సెంటిమెంట్లు నమ్మని వారు చాలా తక్కువ మంది. ఇక సినిమా రంగం తర్వాత రాజకీయ రంగంలోనే ఈ సెంటిమెంట్లు ఎక్కువ. వీటిని అడ్డంపెట్టుకుని కూడా విమర్శలు చేస్తుంటారు కొందరు రాజకీయ నాయకులు.. ఈ విమర్శలకు కొన్ని పరిస్థితులు కూడా కలసివచ్చి.. నిజమేనేమో అనిపిస్తాయి. అలాంటిదే చంద్రబాబు వస్తే కరువు వస్తుందనేది. గతంలో చంద్రబాబు మొదటి సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాష్ట్రాన్ని కొన్నాళ్ల పాటు కరవు వేధించింది. వరుసగా ఏళ్లతరబడి వర్షాలు కురవలేదు.ఆ తర్వాత వైఎస్ ముఖ్యమంత్రి కాగానే మళ్లీ విరివిగా వర్షాలు కురిశాయి. వాతావరణ పరిస్థితులకు, నాయకులకు సంబంధం అంటగట్టడం అంత సమంజసం కాకపోయినా రాజకీయ నాయకులకు అంత మంచిబుద్ది ఎందుకు ఉంటుంది. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం వల్లే.. రాష్ట్రంలో కరువు వచ్చిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించడం ఇందుకు ఓ నిదర్శనం. కరువు సమస్యపై ఆయన ఒక ప్రకటన చేస్తూ బాబు వచ్చె-కరువు తెచ్చే అని ప్రజలలో ఎక్కువ శాతం మంది అనుకుంటున్నారన్నారు. ప్రభుత్వం చేసిన కరువు మండలాల ప్రకటన కూడా పూర్తిగా అసంబద్దంగా ఉందన్నారు. 540 మండలాలు కరువుతో అల్లాడుతుంటే బాబు కేవలం 226మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: