ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ హైదరాబాద్‌లో క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకోనుంది. యుఎస్, యుకె తరువాత హైదరాబాద్‌లో గూగుల్ మూడవ క్యాంపస్ ప్రారంభించబోతుందని ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సెక్రటరీ హర్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ప్రస్తుతం గూగుల్ అద్దె భవనంనుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. త్వరలో పెద్ద భవనంలో శాశ్వత క్యాంపస్ నిర్మించనుంది. సిస్కో, ఏయిర్‌టెల్, వోడాఫోన్, తైవాన్ కంపెనీలు వైఫై పై ఆసక్తి చూపుతున్నట్టు, నగరానికి సంబంధించి వివరాలు అడిగినట్టు హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ వైఫై నగరంగా మారుతోందన్నారు. 30 కోట్ల రూపాయలతో ఇంక్యుబేటర్ ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి 57వేల కోట్ల రూపాయల విలువైన సాఫ్ట్‌వేర్ ఎగుమతులు జరుగుతున్నాయి. 2014-15లో 12 శాతం వరకు వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నట్టు హర్‌ప్రీత్‌సింగ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: