వయస్సు మీద పడింది. నడవడానికీ ఇబ్బంది పడుతోంది. పైగా ఉండేది కావలిలోని ఓ చిన్న ఇంట్లో. కానీ ఆమె ఆదాయం సంగతి తెలిస్తే ఎవరైనా కళ్లు తేలేయాల్సిందే. కారులో తిరగడమే పనిగా పెట్టుకున్న ఆమె కోట్లాది రూపాయలు వెనకేసేసింది. అయితే ఇది సక్సెస్ స్టోరీ ఎంతమాత్రం కాదు. పక్కా చీటింగ్ స్టోరీ. అందుకే పోలీసులకు చిక్కింది. కావలి కిలాడీ లేడి. 30 లక్షలకు పైగా విలువచేసే నోట్ల కట్టలు. 689 గ్రాముల బంగారు ఆభరణాలు. 346 గ్రాముల వెండి. 2 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు. ఇంత భారీగా నగదు, ఆభరణాలు, డాక్యుమెంట్లు దొరికింది ఆమె ఇంట్లోనే. వీటన్నింటినీ సంపాదించింది 73 ఏళ్ల కొమ్మూరి రాజేశ్వరమ్మ. చూడడానికి ఎంతో అమాయకంగా ఉన్న ఈమె ఇంత డబ్బును ఎలా సంపాదించిందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్-గా మారింది. కావలి నుంచి హైదరాబాద్-కు నెలకు 20 సార్లు వస్తోంది రాజేశ్వరమ్మ. గత తొమ్మిది నెలల్లో ఇలా 120 సార్లు హైదరాబాద్ వెళ్లి వెచ్చింది. దీని కోసం ఓ అద్దె కారునూ మాట్లాడుకొంది. ట్రిప్పుకు అతనికి పదివేలు చెల్లిస్తోంది. అంటే నెలకు 2 లక్షల రూపాయలు కారు కిరాయిలే కడుతోంది. ఈమె కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు ముందు డ్రగ్స్ సరఫరా చేస్తుందని భావించారు. అదను చూసి ఆమె ఇంటిలో సోదాలు చేపట్టారు. ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన పోలీసులకు కళ్లు తిరిగినంత పనయ్యింది. భారీగా నోట్లకట్టలు, బంగారం, వెండి, ఆస్తి పేపర్లు చూసి పోలీసులు షాక్ తిన్నారు. ఆమెను, ఆమె కుమార్తె రమాదేవిని అరెస్ట్ చేశారు. ఉద్యోగం గానీ, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై మాత్రం రాజేశ్వరమ్మ, రమాదేవి పెదవి విప్పడం లేదు. అయితే హైదరాబాద్-లోని ఇరిగేషన్ డిపార్ట్-మెంట్-లో పనిచేస్తున్న ఓ వ్యక్తి వీరికి ఈ డబ్బును ఇస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. రాజేశ్వరమ్మతో పాటు, ఆమెకు సహరిస్తున్న కారు డ్రైవర్ జవనీర్ ఇమ్రాన్, మాజీ కౌన్సిలర్ ప్రసన్నాంజనేయులును అరెస్ట్ చేశారు పోలీసులు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదు, డబ్బును ఐటీ శాఖకు అప్పగిస్తామన్నారు పోలీసులు. అయితే వీళ్లకు డబ్బులు ఇచ్చిన ఇరిగేషన్ ఉద్యోగి ఎవరన్నది తేల్చలడమే ఇప్పుడు పోలీసులకు సవాల్-గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: