చంద్రబాబునాయుడు వంటి నాయకుడి ఆధ్వర్యంలో నవ్యాంధ్ర దూసుకుపోతుంది. చంద్రబాబు 24 గంటలు కష్టపడే వ్యక్తి.. ఆయన మార్గదర్శకత్వంలో పురోగమిస్తాం.. ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఐటీలో నెంబర్ వన్ గా నిలుపుతాం.. ఏడు మిషన్లు.. ఐదు గ్రిడ్లతో అభివృద్ధి పరుగులు పెట్టిస్తాం.. ఇవీ పొద్దునలేస్తే టీడీపీ నేతలు, మంత్రులు చెప్పే మాటలు. మరి ఏపీ అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్రబాబు కష్టపడితే సరిపోతుందా.. మిగిలిన మంత్రులంతా కాళ్లు బారా చాపుకుని పడుకోవచ్చా.. కాంట్రాక్టులు, సెటిల్ మెంట్లు, కలెక్షన్లు చూసుకుంటే కాలం గడిపితే చాలా.. ఇప్పుడు ఏపీ మంత్రులను చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతోంది. ఆరు నెలలు పూర్తయిందో లేదో.. అప్పుడే ఏపీ మంత్రివర్గంలో కుంపట్లు రాజుకుంటున్నాయి. ఓ పక్క మంత్రులు గంటా శ్రీనివాసరావుకూ, అయ్యన్నపాత్రుడికీ పడదు.. లేటెస్టుగా .. ఉపముఖ్యమంత్రికీ.. మంత్రి నారాయణకూ సంబంధాలు చెడిపోయాయి. మరోపక్క మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నారాయణల వ్యవహారశైలిపై లోకల్ ఎంపీలు మండిపడుతున్నారు. ఆరునెలల్లో ఒక్కపనీ కాలేదని.. ఎంపీ కేశినేని నాని విజయవాడలో జరిగిన ఓ సభలో పబ్లిగ్గానే తన అసంతృప్తి వెళ్లగక్కారు. మరోవైపు చంద్రబాబు కూడా అన్నీ తానే నడిపించాలనే తరహాలో వ్యవహరిస్తుండటం కూడా మంత్రుల అనాసక్తికి కారణంగా కనిపిస్తోంది. మరి ఇలాంటి టీమ్ తో నవ్యాంధ్ర ప్రగతిరథం ఏమేరకు పరుగులు తీస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: