ఎలాగైనా దక్షిణాదిలో బలపడాలనేది భారతీయ జనతా పార్టీ ప్రస్తుత ఆకాంక్ష. కేంద్రంలో అధికారం చేతిలో ఉన్న ప్రస్తుత తరుణంలో దక్షిణాదిలో పాగా వేయాలని.. ఇక్కడ రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించుకొని సత్తా చాటాలని... భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలపై కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నో ఆశలను పెట్టుకొంది. అయితే భారతీయ జనతా పార్టీ ఆశలకు ఆ పార్టీ మిత్రపక్ష నేత చంద్రబాబునాయుడే గండి కొడుతున్నాడు. బలపడాలన్న భారతీయ జనతాపార్టీ వ్యూహాలకు ప్రతివ్యూహంతో బాబే దెబ్బ ొడుతున్నాడు.ఉదాహరణకు కాంగ్రెస్ లో ఉండటం వల్ల ఇక ప్రయోజనం లేదని నమ్ముతున్న నేతలు.. వైకాపాలోని కొంతమంది అసంతృప్త వర్గాలు భారతీయ జనతా పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు. పెద్దగా క్యాడర్ , నాయకత్వలోటు ఉన్న బీజేపీలో చేరితే భవిష్యత్తులో ఎదగగలమని వారు నమ్ముతున్నారు. అయితే బాబు ఇలాంటి వారిని బీజేపీ వైపు వెళ్లకుండా అడ్డుకొంటున్నట్టుగా తెలుస్తోంది. వారితో తన పార్టీకి ఉపయోగం లేకపోయినా బాబు వారిని చేర్చుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నాడట! ఒకవేళ ఇలాంటి వాళ్లంతా వెళ్లి బీజేపీలో చేరితే ఆ పార్టీ బలపడుతుందని.. ఎన్నికల సమయంలో భారీ సంఖ్యలో సీట్లను డిమాండ్ చేస్తుందని.. అందుకే వ్యూహాత్మకంగా వీరిని టీడీపీలో చేర్చుకొంటే సరిపోతుందని బాబు భావిస్తున్నాడట. ఈ విధంగా తెలుగుదేశం అధినేత మిత్రపక్షాన్ని దెబ్బకొడుతున్నాడు. మరి బీజేపీ ఈ పరిణామాల పట్ల ఎలా స్పందిస్తుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: