భారత దేశంలో ప్రభుత్వాలకు చాలా చెడ్డగుణాలుంటాయి. తమకు కావాల్సిన వాళ్ల విషయంలో చట్టాలను అతిక్రమించేస్తూ ప్రభుత్వాలు చెడ్డపేరు తెచ్చుకొంటుంటాయి. ఏప్రభుత్వం వచ్చినా ఎవరో కొందరు లాభపడుతూ ఉంటారు. డబ్బు, పలుకుబడి ఉన్న వారు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతూ ఉంటారు. ఇవన్నీ వివాదాలు, అవినీతి కేసులు అయినా... అధికారంలో ఉన్న వారు మాత్రం తమ అనునూయులకు ఏదో విధంగా సహకరిస్తుంటారు. సరిగా ఇలాంటి సహకారమే ఇప్పుడు రామోజీ రావుకు అందబోతోందని సమాచారం. ఈనాడు సంస్థల అధినేత అయిన రామోజీ మీడియాటైకూన్ గా పేరు పొందాడు. ప్రభుత్వాలను దించేసే.. నిలబెట్టేంత శక్తి ఈయనమీడియా సంస్థలకు ఉందనే పేరొచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన "ఓం'' అనే అధ్యాత్మిక నగరాన్ని నిర్మించదలిచాడనే వార్తలు వస్తున్నాయి. అయితే అధ్యాత్మికం, భక్తి అనే అంశాలను కమర్షియలైజ్ చేసుకొనే పనిలో ఉన్న రామోజీ రావుకు ప్రభుత్వ పరంగా కొన్ని ఆటంకాలున్నాయట. ఉదాహరణకు సదరు అధ్యాత్మిక కేంద్రం లేదా గుడిలో క హుండీని పెట్టినా అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. హుండీ ఉన్నదల్లా దేవాదాయశాఖ కిందకు వస్తుంది. ఈ నేపథ్యంలో రామోజీ రావు నిర్మించే "ఓం'' కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుంది. మరి తను అంత కష్టపడి నిర్మించి దాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పడానికి రామోజీరావు ఎలా ఒప్పుకొంటాడు? అందుకే.. ఇప్పుడు ప్రభుత్వం నుంచే మినహాయింపు పొందడానికి ప్రయత్నిస్తున్నాడట ఆయన. అందుకు సంబంధించి ఇప్పుడు లాబీయింగ్ జరుగుతోందట. మొత్తానికి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం రామోజీరావుకు చుట్టం అయినట్టుగా ఉంది!

మరింత సమాచారం తెలుసుకోండి: