రాజధాని గ్రామాల్లో అరాచకంపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ నేతలు పార్థసారధి, మేరుగ నాగార్జున సోమవారమిక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుళ్లూరు మండలంలో పలు గ్రామాల్లో దుండగులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సీపీ నేతలు ఈరోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ కుట్ర వెనుక రాష్ట్ర ప్రభుత్వమే ఉందని ప్రజలు అనుమానిస్తున్నారని విమర్శించారు. పంటలు పండే భూములను లాక్కోవాలని చూడటం... రైతులు ఎదురు తిరిగితే సర్కార్ రాక్షసంగా వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబే ఈ సంఘటన వెనుక ఉన్నారా? అని ప్రజలు అనుమానిస్తున్నారని పార్థసారధి ఆరోపించారు. ఈ ఘటనపై గవర్నర్ వెంటనే స్పందించి కేంద్రానికి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. తమకు పోలీసులపై నమ్మకం లేదన్నారు. కండితుడుపు చర్యగా విచారణ జరిపితే సహించేది లేదని అన్నారు. అందరూ సంతోషంగా ఏర్పాటు చేసుకోవాల్సిన రాజధానిని ...బలవంతంగా,అమానుషంగా వ్యవహరించటం సరికాదన్నారు. ఈ సంఘటన వెనుక ఉన్న శక్తులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ నేతలు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: