ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ చర్చల్లో ‘‘అధికార మార్పిడి’’ అనే పదాన్ని అధికంగా ఉపయోగించడం కొనసాగుతోంది. దురదృష్టవశాత్తు నేటి పరిస్థితుల్లో అది ఉపయోగించాల్సిన సరైన పదం కాదేమోననిపిస్తున్నది. 2014, మే 16 ఉదయం వరకు కొద్దో గొప్పో వీరిలో చాలామందికి భారతీయ ఓటర్లు నరేంద్ర మోదీ సృష్టించిన ప్రభంజనానికే అనుకూలంగా ఉన్నార్న సంగతి తెలియదు. నిజం చెప్పాలంటే జమ్మూకాశ్మీర్ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులోని బలహీనతను బయటపెట్టాయి. సాధారణ పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ పనితీరును గతంలో దాని పనితీరును బట్టి అంచనా వేయడం జరుగుతుంది. ఈ కారణం చేతనే 2014 సాధారణ ఎన్నికలను కూడ 2009నాటి ఫలితాలను బట్టే విశే్లషించారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే భారత ఓటర్లు పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకే మాదిరిగా కాకుండా భిన్నంగా స్పందించారన్న సంగతి స్పష్టమైంది. పోలికలు ఎప్పుడూ కచ్చితంగా ఉండాలి తప్ప, అడ్డదిడ్డంగా ఉండకూడదన్న సంగతి రాజకీయ పండితులకు బాగా తెలిసిన విషయమే. రాజకీయ విశే్లషకులు భారతీయ జనతాపార్టీ విషయంలో ఒక నిర్ణయానికి రావడంలో ఈ సూత్రాన్ని దాదాపుగా పట్టించుకోలేదన్నదే ఇక్కడ విషాదం. ఈ అధికార మార్పిడి అనే అంశం మొట్టమొదటి సారిగా గత అక్టోబర్‌లో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఫలితాల వెల్లడికి ముందు జరిగిన విశే్లషణల్లో కూడ వ్యాఖ్యాతలు భాజపాకు సానుకూల వాతావరణమే ఉన్నదని, భారీ మెజారిటీ తథ్యమంటూ గట్టి విశ్వాసంతో పేర్కొన్నారు. కానీ జరిగిందేమిటంటే..జార్ఖండ్‌లో భాజపాకు అందరూ అంచనా వేసిన మెజారిటీ రాలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని దాదాపు 60 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముందంజలో ఉన్న భాజపా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి 42తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే భాజపా పనితీరు దిగువస్థాయిలో ఉన్నదని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుత పనితీరుకు భాజపా మాత్రమే బాధ్యత వహించాలి. జమ్మూకాశ్మీర్ ఎన్నికల ప్రచార సందర్భంగా భాజపా ‘‘మిషన్ 44’’ పేరుతో ఎన్నికల రంగంలోకి దిగడంతో, అంతకు ముందు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పరిణామాలే పునరావృత్తమవుతాయన్న విశ్వాసంతో రాజకీయ విశే్లషకులు, ప్రధాని మోదీ ప్రభావంతో జమ్మూ కాశ్మీర్‌లో కూడా భాజపా పాగా వేస్తుందనే తీర్మానించేశారు. అంతేకాదు తమ వాదనలకు బలం చేకూరేవిధంగా ‘‘శాస్ర్తియ దృక్పథాన్ని’’ కూడా జోడించి మరీ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇదంతా ఒక ఉపాసనా ప్రక్రియ మాదిరిగా నడచిందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నిజానికి జమ్మూ కాశ్మీర్‌లో భాజపా పనితీరు అద్భుతమనే చెప్పాలి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భాజపా 25 సీట్లు గెలుచుకోవడం సామాన్య విషయం కాదు. ముఫ్తీ మహమ్మద్ సరుూద్ నేతృత్వంలోని పిడిపితో నువ్వా నేనా అన్నట్లు సాగిన పోటీలో ఆ పార్టీకి గట్టిపోటీ ఇవ్వడమే కాదు పిడిపి కంటే ఎక్కువ శాతం ఓట్లను సాధించగలిగింది. కాశ్మీర్‌లోయలో మాత్రం ఒక్క స్థానాన్ని గెలవలేకపోయింది. కాకపోతే కాశ్మీర్ లోయలో జరిగిన నష్టాన్ని జమ్మూ లో పూడ్చుకోవడం విశేషం. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడ భాజపా ఖాతా తెరవగలిగింది. మిషన్- 44+ సాధనలో భాజపా బయటి స్థానం నుంచి, రాష్ట్ర ఆంతరంగిక చర్చల్లో భాగస్వామ్యమయ్యే స్థితికి చేరుకోవడాన్ని రాజకీయ పండితులు గ్రహించలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ భాజపా అతిముఖ్యమైన జాతీయ పార్టీగా తనను తాను పునరుజ్జీవింపజేసుకున్నదన్న మాట మాత్రం సత్యం. ఇదే సమయంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారడం కూడా ఒక సహజ ప్రక్రియగా మారిపోయింది. జార్ఖం డ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో అది నాలుగోస్థానానికే పరిమితం కావలసి వచ్చింది. రానున్న కాలంలో భాజపా ఎంత వేగంగా పైకి ఎదుగుతుందో, కాంగ్రెస్ పతన పథం కూడా అంతేవేగంగా ఉండబోతున్నదని చెప్పవచ్చు. అంతేకాదు భవిష్యత్తులో భాజపా పట్ల ప్రజల్లో మరింత ఆసక్తి పెరగవచ్చు. మోదీ-అమిత్ షా ద్వయం ‘‘కాంగ్రెస్ విముక్త భారత్’’ అంటూ ఇస్తున్న పిలుపు మరింత సుప్రతిష్ఠితం కానున్నది. అంటే భాజపా ఉత్థానం, కాంగ్రెస్ పతనం భారత్ రాజకీయ వ్యవస్థ లక్షణానే్న మార్చివేయనున్నది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కాంగ్రెస్ మరింతగా దెబ్బతినిపోవడమనేది భాజపా అందించే పాలనపై ఆధారపడి ఉంటుంది. అది ఎంత ఉత్తమ పాలనను అందించగలిగితే కాంగ్రెస్ పతనం అంతే స్థాయిలో కొనసాగుతుంది! ఎప్పుడైతే ఎన్నికల్లో వరుస పరాజయాల పరంపర కొనసాగుతుంతో అప్పుడు కాంగ్రెస్‌కు.. మోదీ ప్రభుత్వం పయనించే మార్గంలో అడ్డంకులు సృష్టించే సామర్ధ్యం కూడా బలహీనపడుతుంది. రాబోయే నూతన సవత్సరంలో కేంద్రంలోమోదీ ప్రభుత్వం బ్యూరోక్రసీ నుంచి మరింత సహకారాన్ని పొందుతూ, మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశాలు స్పష్టం గా కనిపిస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే... కేవలం అభివృద్ధి కోసం ప్రజలకు పిలుపునిస్తూ మోదీ ముందుకుపోయారే తప్ప, భాజపాను సుసంఘటితం చేయడలో నిర్లక్ష్యం వహించారని వస్తున్న ఆరోపణలు అర్ధసత్యాలు మాత్రమే. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి తన వ్యక్తిగత పలుకుబడిని రిస్క్‌లో పడేయడం ఏ ప్రధానికైనా కష్టసాధ్యమే. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనేక స్థానిక సమస్యలు, రాజకీయాలు ప్రభావం చూపుతాయి. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో రాజీవ్ గాంధీ ఎదురులేకుండా రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసేవారు. కానీ ప్రస్తుత నరేంద్ర మోదీ పరిస్థితి వేరు. ఆయన రాష్ట్ర యూనిట్లకు తనపట్ల మంచి అభిప్రాయాన్ని వ్యవస్థీకృతం చేసుకోగలగడం ఆహ్వానించదగ్గ పరిణామం. హర్యానా, జార్ఖండ్‌ల్లో భాజపా గొప్ప విజయం సాధించడం, మహారాష్టల్రో శివసేనను వెలికి తీసుకొని రావడాన్ని నేరుగా మోదీ ఇచ్చిన పిలుపుల ఫలితమేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక జమ్మూ విషయానికి వస్తే..కాంగ్రెస్ ప్రాభవం తగ్గడం, అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పనితీరుపట్ల ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తం కావడం గమనార్హం. గత పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే ఓటర్లు జాతీయ పార్టీలవైపు ముఖ్యం గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే వాటివైపు మొగ్గుచూపారన్నది స్పష్టమైంది. అయితే పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు ఈ ట్రెండ్‌కు మినహాయింపు. జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, రాష్ట్రాల్లో కూలిపోయిన కాంగ్రెస్ పునాదులనుంచి భాజపా పటిష్టమైందని చెప్పడం సము చితం. ఇక రానున్న నాలుగేళ్ల కాలంలో భాజపాకు నిజమైన ప్రతిపక్షంగా ప్రాం తీయ పార్టీలు వ్యవహరించనున్నాయి. ముఖ్యంగా కేంద్ర రాజకీయాల్లో అవమానానికి గురైన ప్రాంతీయ పార్టీలే భాజపాకు గట్టి ప్రత్యర్థులుగా రూపొందవచ్చు. ఇది తిరిగి ఏకమైన జనతా పరివార్‌కు సం తోషం కలిగించే వార్త. నిజానికి జనతాపరివార్‌లో భాగస్వాములుగా ఉన్నవి ప్రాం తీయ పార్టీలు మాత్రమే. లల్లూప్రసాద్ యాదవ్, నితిష్ కుమార్‌ల ద్వయం, వచ్చే ఏడాది బీహార్‌లో భాజపా దూకుడుకి అడ్డుకట్ట వేయగలిగినప్పుడే కాంగ్రెస్ కంటే, జనతాపరివార్ గట్టి ప్రతిపక్షంగా వ్యవహరించగలుగుతుంది. ఇదే సమయంలో ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మోదీకి తీవ్ర నిరాశకలిగిస్తాని భావించడం కూడ సరికాదు. కానీ నేడు ప్రతిపక్ష రహిత భారత్ రూపొందిందని మాత్రం తేలిగ్గా చెప్పవచ్చు. నీతిభ్రష్టమైన కాంగ్రెస్ నేడు తన స్థానాన్ని కోల్పోయింది. ఇక దేశంలోని ప్రాంతీయ పార్టీలు అతి ప్రాంతీయతత్వాన్ని కలిగివుండటం వల్ల, వాటి ప్రతిఘటన అంత ప్రభావయుతంగా ఉండబోదు. ఇక భాజపా విషయానికి వస్తే పార్టీలో మోదీకి తిరుగులేని ఆధిపత్యం ఉంది. మరి ఈ ఏకపక్ష దేశ రాజకీయాలు ఎంతకాలం కొనసాగుతాయనేది, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రాబో యే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నిలదొక్కుకోవడంపై ఆధారపడివుంది. భారత రాజకీయాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటా యి. కానీ కొనసాగుతున్న విధానంలో మార్పు రావడానికి కొద్ది కుదుపుచాలు మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: