ఈ ఏడాది 2015లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ రాజకీయ రూపంలో కచ్చితంగా మార్పు కనపడనున్నది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన పదవిని పరిత్యజించి కొడుకు రాహుల్‌గాంధీకి 130ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్‌పార్టీకి అధ్యక్షుడిగా అధికారం కట్టబెట్టిన తర్వాత ప్రియాంక గాంధీకి రారుబరేలీ నుండి పోటీచేసే అవకాశం కల్పించవచ్చు. అనారోగ్యం కారణంగా సోనియాగాంధీ క్రియాశీల రాజకీయాల నుండి వైదొలగనున్నారు. అనంతరం ఆమె లోక్‌సభ స్థానానికి రాజీనామా చేస్తారు. ఆమె తర్వాత రారుబరేలీ నుండి ప్రియాంక పోటీచేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీ అధ్యక్షపదవికి సోనియా రాజీనామా చేసిన తర్వాత ఆమె తీసుకునే బాధ్యత ఏమిటన్నదానిపై స్పష్టతలేదు. పార్టీ నాయకత్వానికి ఆమె మార్గదర్శకురాలిగా ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇవన్నీ రానున్న కాలం రాహుల్‌, ప్రియాంకలదే అనటానికి సంకేతాలు. వీటన్నిటి దృష్ట్యా ప్రియాంక తన సోదరుడు రాహుల్‌ అండతో పార్టీలో కీలకపాత్ర పోషిస్తారనవచ్చు. ఎన్నికల్లో గెలిస్తే ప్రియాంక లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: