ఆంధ్రాలో అతి సుందరమైన నగరాల్లో విశాఖకు అగ్రస్థానం. సాగర తీరాన కొలువైన ఈ నగరం.. అటు పర్యాటక పరంగానూ.. ఇటు రక్షణ పరంగానూ కీలకమైంది. ఇప్పుడు ఏపీలోనే మొట్టమొదటి స్మార్ట్ సిటీగా అవతరించబోతోంది. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ సిటీల జాబితాలో చేరబోతోంది.  స్మార్ట్ నగరాల నిర్మాణంలో భాగంగా విశాఖను అభివృద్ధి చేసేందుకు అమెరికా-భారత్ దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదరబోతోంది. ఢిల్లీలో అమెరికన్ ఆఫీసర్లు, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేస్తారు. ఇది పూర్తయితే... ఇక ఉక్కు నగరం విశాఖ.. స్మార్ట్ నగరం ఐపోతుంది. గత ఏడాది ప్రైమ్ మినిస్టర్ మోడీ అమెరికా వెళ్లినప్పుడు.. అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామాతో స్మార్ట్ సిటీల రూపకల్పనకు సాయం చేయాలని అడిగారు. మోడీ అడక్క అడక్క అడిగేసరికి ఒబామా.. ఇండియాలోని మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా మారుస్తామని హామీ ఇచ్చారు.  ఒబామా హామీ ఇచ్చిన ఆ మూడు నగరాల్లో ఒకటి మన విశాఖ కావడం విశేషం. ఇప్పటికే అమెరికన్ ప్రతినిధుల బృందం స్మార్ట్ వర్క్ స్టార్ట్ చేసింది. ఏపీ మున్సిపల్ అధికార్లతో కలసి వైజాగ్ ను సందర్శించారు. విశాఖకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కావాలి.. అందుకు ఎలాంటి వనరులు ఉన్నాయి.. అదనంగా కల్పించాల్సిన సౌకర్యాలేంటి.. తక్షణం ఎలాంటి సౌకర్యాలు కల్పించొచ్చు వంటి అంశాలపై రిపోర్టులు కూడా తయారు చేశారు. ఈ కొత్త ఒప్పందం ప్రకారం.. వైజాగ్ స్మార్ట్ సిటీ ప్లాన్ కూడా రెడీ చేస్తుందట. అంటే టోటల్ గా.. వైజాగ్ తలరాతే మారిపోతుందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: