కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. దశల వారీగా కమలదళంపై పరోక్షంగా విమర్శలు మొదలు పెట్టి వాటిని తీవ్రం చేసే దిశగా ముందుకు వెళుతోంది ఏపీ లోని ప్రతిపక్ష పార్టీ. విధానపరమైన అంశాలను టేకప్ చేసి విమర్శలు మొదలు పెడుతోంది. ఈ విషయంలో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి క్రియాశీలకంగా కనిపిస్తున్నాడు.

ఇంతకు ముందే ఒకసారి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై విమర్శలు చేశాడు మిథున్ రెడ్డి. పేరుకు కేంద్రమంత్రి.. తెలుగువాడు అయినా... రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోతున్నారని మిథున్ అన్నాడు. తాజాగా కేంద్రమంత్రులను లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశాడు మిథున్.

ఏపీలో పేరుకు కేంద్రమంత్రులు ఉన్నా వీరివల్ల రాష్ట్రానికి ఒరుగుతున్నది ఏమీ లేదని వైకాపా ఎంపీ విమర్శించాడు. రాష్ట్రంలో రైల్వేలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని ఈ వైకాపా ఎంపీ ధ్వజమెత్తాడు. మరి ఇలాంటి విధానపరమైన విమర్శలు ఆహ్వానించదగినవే. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని.. భయపడకుండా... రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై నినదించే హక్కు అందరికీ ఉంటుంది.

మరి వైకాపా ఈ బాధ్యతను నిర్వర్తించడం ఇన్ని రోజులగా కొంత వెనుకబడిన వైకాపా ఇకనైనా ప్రత్యేక హోదా, ఏపీకి జరుగుతున్న అన్యాయాలను చర్చనీయాంశంగా చేయడం మంచిదేనేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: