మంత్రివర్గం నుంచి తొలగించడంతో మనస్థాపం చెందిన రాజయ్యను బుజ్జగించేందుకు సీఎం కేసీఆర్‌ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి, వరంగల్‌ జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డిని రంగలోకి దింపారు. వరంగల్‌ ఎంపీగా బరిలోకి దిగాలని రాజయ్యకు సూచించి నట్లు సమాచారం. పార్ల మెంట్‌సభ్యునిగా మంచి అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు వివరించినట్లు తెలిసింది. అయితే రాజయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్‌ఘనపూర్‌ అసెంబ్లిd నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరిని పోటీకి దింపాలనే ఆలోచనతోనే ఈ బుజ్జగింపులు చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. తనకు పార్టీలో జరిగిన అవమానంపై తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వంలో తానొక్కడినే తప్పులు చేశానా..?, అయినా జరిగిన పొరపాట్లకు సంజాయిషీ చెబుతూ సీఎంకు లేఖ రాసినా ఇంత ఘోరంగా ప్రవర్తించడమేమిటని బుజ్జగింపులకు వెళ్లిన నేతల వద్ద రాజయ్య ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి వరంగల్‌ పార్లమెంట్‌కు మాజీ ఎంపీ జీ వివేక్‌ను బరిలోకి దింపాలనే ఆలోచన ఆ పార్టీ ఉన్నట్లు తెలుసున్నది. వివేక్‌ కూడా తెలంగాణ కోసం కాంగ్రెస్‌ అధిష్ఠానంపై గట్టిగా పోరాటం చేయడమే కాకుండా ఆర్థికంగా బలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎస్సీల్లో బలంగా ఉన్న మాదిగ, మాల సామాజిక వర్గాలు టీఆర్‌ఎస్‌ పార్టీపై గుర్రుగా ఉన్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్‌ మంత్రి వర్గంలో మాల సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు. మాదిగ సామాజికవర్గం నుంచి ఒక రాజయ్యను బర్తరఫ్‌ చేయడంతో ఆ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని కాంగ్రెస్‌ పార్టీ గుర్తించింది

.

.

.

మరింత సమాచారం తెలుసుకోండి: