ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ పూజా ఠాకూర్‌కు ఒబామా పర్యటన సందర్భంగా అరుదైన అవకాశం దక్కింది. రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాలు సమర్పించిన గౌరవ వందనానికి పూజా సార థ్యం వహించారు. ఈ బాధ్యత లు నిర్వహించిన తొలి మహిళ పూజే కావడం విశేషం. తాను మొదట అధికారినని.. ఆ తర్వా తే మహిళనని పూజా ఠాకూర్ పేర్కొన్నారు. త్రివిధ దళాలు సమర్పించిన గౌరవ వందనానికి సారథ్యం వహించడం గొప్ప గౌరవమని కార్యక్రమం అనం తరం పూజ మీడియాతో చెప్పారు. త్రివిధ దళాలు సమర్పించిన గౌరవ వందనానికి ఎయిర్‌ఫోర్స్ కమాండింగ్ తరఫున నాయకత్వం వహించడం గర్వకారణం. అందునా ఒబామాకు గౌరవ వందనం ఇవ్వడం ఎంతో ఆనందదాయకం అని ఆమె పేర్కొన్నారు. సైన్యంలో మహిళలు పనిచేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. మొదటగా మేము అధికారు లం. పురుషులా.. మహిళలా అన్నది తర్వాత. అందరికీ ఒకే రకమైన శిక్షణ ఇస్తారు. మేమంతా సరిసమానులం అని పీటీఐతో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: