ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో సీఎం కేసీఆర్‌ చీకటి ఒప్పం దం చేసుకున్నారని మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్‌ ఆరోపించారు. రామోజీ ఫిలిం సిటీలో తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉద్యోగం చేస్తున్నారో చెప్పాలని ఆయనే డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అవినీతి, అక్రమాలు కేసీఆర్‌ కుటుంబం అండతోనే జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. దళితుడైన రాజయ్యను బర్తరఫ్‌ చేయడం కేసీఆర్‌ దొరతనానికి నిదర్శన మన్నారు. మెడికల్‌ కాలేజీ ల ఫీజుల విషయంలో రూ. వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రేషన్‌ కార్డులు, ఫించన్లలో తప్పుడు లెక్కలున్నా యంటూ ప్రజలను దొంగలుగా చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు.  తెలంగాణ ప్రభుత్వం అవినీతి, అక్ర మాల్లో కూరుకుపోయిందని కాంగ్రెస్‌ ఎమ్మె ల్సీ షబ్బీర్‌అలీ ఘాటుగా విమర్శించారు. దళిత రాజయ్యను మంత్రి పదవికి రాజీ నామా చేయించకుండా.. బర్తరఫ్‌ చేయడానికి గల కారణాలేంటో చెప్పాలన్నారు. సోమ వారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దళిత వ్యక్తిని బర్తరఫ్‌ చేయడం అవమానకర మన్నారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాల తర్వాత టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు ఉంటాయని జోస్యం చెప్పారు. తమ పార్టీ నుంచి ఎవరూ కుడా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైద్య శాఖలో జరిగిన అవినీతిని సీఎం ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. రాజయ్యను బర్తరప్‌ చేశారంటే.. ఆ శాఖలో భారీగా అవినీతి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

.

.

.

మరింత సమాచారం తెలుసుకోండి: