తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి, కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడు మాసాలు కావస్తున్నా సంక్షేపథకాల అమలు తీరు అస్తవ్యస్థంగా మారింది. అధికారం చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ పాలనా ఇంకా గాడిలో పడలేదన్న విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన కొన్ని కొత్త నిర్ణయాలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావించిన పాలకులు క్షేత్రస్థాయిలో అందుకుభిన్నంగా వ్యతిరేకత మూటగట్టుకుంటోంది. ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానాలు, పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక లో క్షేత్రస్థాయి అధికారులు వ్యవహరించిన తీరు ప్రభుత్వానికి మంచిపేరు రాక పోగా చెడుపేరు వస్తుందని ఎమ్మెల్యేలు, మంత్రులు బాధపడుతూనే ఉన్నారు.  పింఛన్ల  లబ్ధిదారుల ఎంపికపై మండలస్థాయి అధికారులు రూపొందించిన జాబితాపై బడుగు, బలహీన వర్గాలు కన్నెర్ర చేస్తున్నాయి. గ్రామాల్లో అనధికా రులను ఎంపిక చేసిన అధికారులు అర్హులైన వారిని ఎంపిక చేయకపోవడంతో ఇంకా మండలాలలో ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనితో పాటు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న నిత్యావసరాల సరఫరా కోసం ఆహార భద్రత  కార్డులకు లబ్ధిదారుల ఎంపికలో కూడా అక్రమాలు చోటుచే సుకున్నా యన్న బలమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన వారి పేర్లు జాబితాలో కనపబడకపోవడంతో గ్రామాల నుంచి బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్ర జలు తాహశీల్దార్ల కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పథకాలు దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షుగా పేదల పథకాలు మారాయి. వర్షాభావ పరిస్థి తులతో అల్లాడుతున్న జనానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల అమలు షరాఘాతంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో సింహా భాగంలో నిలిచిన బడుగు, బలహీన వర్గాలు, నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం ఇంకా దృష్టిసారించలేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిత్యం కాయ కష్టం చేసినా రెండుపూటలా తిండిదొరకని అభాగ్యుల కోసం అమలు చేస్తున్న సబ్సిడీ వస్తువులు వారికి అందడం లేదు. ఆర్థిక స్థోమతలేని నిరుపేద విద్యార్థు లు ఉన్నత చదువులు చదువుకునేందుకు ప్రవేశపెట్టిన బోగస్‌ లబ్ధిదారుల ఏరి వేత పేరుతో ప్రభుత్వం రోజుకో ఉత్తర్వులు వెలువరిస్తుండడంతో ప్రజలు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణాలో ఉన్న కుటుంబాల కంటే అధికంగా తె ల్లరేషన్‌కార్డులున్నాయన్న పేరుతో ప్రభుత్వం ఏరివేత కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సమగ్రకుటుంబ సర్వే, అనంతరం ప్రభుత్వ పథకాలకు లబ్ధిపొందేం దుకు కొత్తగా ధరఖాస్తు చేయాలన్న ప్రభుత్వ తీరుపై బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఉన్న ఎలుకను పట్టుకునేందుకు ఇంటినే తగులబెట్టిన చందంగా ప్రభుత్వ తీరుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా యి. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం ఆ హారభద్రతకార్డులు జారీపై విధించిన నిబంధను పరిశీలిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరుమాసాలు గడుస్తున్నా బడు గు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు చెల్లించే పథకంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఫీజు చెల్లించేందుకు అర్హులైన విద్యార్థులను గుర్తిం చేందుకు దృవపత్రాల జారీపై ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని, విధివిధానాల జారీ లో తీవ్రజాప్యం చేస్తున్నది. దీంతో కళాశాలల యాజమానులు ఫీజులు చెల్లిం చాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకవస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: