నేతాజీ సుభాష్ చంద్ర బోస్ భారత స్వాతంత్ర ఆధ్యాయం లో ఒక గొప్ప వ్యక్తి. నేతాజీ కొన్ని ఉద్యమాలతో అప్పుడు బ్రిటిష్ దొరలలో వణుకు పుట్టిందంటే అతిశయోక్తి కాదేమో… అటువంటి నేతాజీ మరణం ఇప్పటికి వివాదాస్పదమే.., అసలు ఇప్పటికి ఆయన మరణించార బ్రతికే ఉన్నారా అన్న అనుమానాలు తీరనూ లేదు. అసలు ఆయన అదృశ్యం అయితే ఎక్కడ ఉండి ఉంటారన్న సందేహం తో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటి ని కూడ వేసినప్పటికి, ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో మళ్ళి మొదటికి వచ్చింది.

పశ్చిమ బెంగ లో ఉన్న స్వామిజి నే బోస్ గా పేర్కొన్నప్పటికీ, ఆయనే బోస్ అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇప్పటికి ఆయనకు సంబంధిచిన ప్రతి అంశం వివాదాస్పదమే. ఆయన ప్రభావం ఎంతంటే బోస్ దొరికితే బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించాలన్న ఒప్పందం పైనే స్వాతంత్రం ఇచ్చారు. అంతల బ్రిటిష్ వాడి గుండెల్లో హడలు పుట్టించిన బోసు అదృశ్యం ఇప్పటికి ఎవరికీ తెలియక పోవటం భారతీయుల హృదయాల్ని కలిచి వేస్తుంది.

తాజాగా బిజెపి నేత సుబ్రమణ్య స్వామి మరో సంచలన వ్యాఖ్య చేశారు.., బోసు ను అదుపు లోకి తీసుకున్న రష్యా ప్రభుత్వం వెంటనే భారత ప్రధాని నెహ్రు కి సమాచారం చేరవేసిందని బోస్ ని చంపేందుకు నెహ్రు సరే అన్నారని సుబ్రమణ్య స్వామి తాజా ఆరోపణ.., దేశ వ్యాప్తంగా చర్చనీయంశమైన మారిన ఈ వ్యాఖ్య ఇప్పుడు సంచలనానికి దారి తీస్తుంది. రాజకీయ శరణార్థి గా రష్యా లో ఆశ్రయం కోరినా, రష్యా అధ్యక్షుడు స్టాలిన్ అరెస్ట్ చేయించి మరి, నెహ్రు సమచారమందిచారని, దానితో బోసు ను హతమార్చేందుకు నెహ్రు తన సమ్మకాన్ని తెలియ జేసారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రధాన లేఖను.., అపట్లో ఆయనకు స్టేనోగ్రాఫర్ గా పని చేసిన మీరట్ వాసి శ్యాం లాల్ జైన్.., టైపు చేశారని ఆ తర్వాత బోసు అదృశ్యం పై ఏర్పాటైన కేంద్ర కమిటి ముందు ఈ విషయం శ్యాం లాల్ చెప్పిన కాని ఆధారాలు లభించలేదని చెప్పారు. మరి తాజాగా ఈయన గారు పేల్చిన బాంబు ఎవరికీ మంట పెట్టిస్తుందో చూడాలి మరి…!

.

మరింత సమాచారం తెలుసుకోండి: