అమెరికాను మంచు తుపాను గజగజలాడిస్తోంది. కొన్ని చోట్ల ఆరు అంగుళాల ఎత్తున కూడా మంచు పేరుకుపోయి మొత్తం రవాణా వ్యవస్థను స్తంభింప చేసింది.న్యూయార్కు, బోస్టన్ తదితర ప్రాంతాలలో మంచు తుపానుతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది.సుమారు ఎనిమిదివేల విమాన సర్వీసులను రద్దు చేయవలసి వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే తీవ్ర సమస్య అవుతోంది.పన్నెండు రాష్ట్రాలలో మంచు తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెప్పడంతో ఆరు రాష్ట్రాలలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: