రిపబ్లిక్‌డే పెరేడ్‌పై అమెరికా అసంతృప్తిగా ఉందా? పరేడ్‌లో ఒబామా ఇబ్బందిగా ఫీలయ్యారా..? అట్టహాసంగా, అద్భుతంగా జరిగిన పెరేడ్‌పై.. అమెరికా అభ్యంతరం ఏంటి.? ఒబామా ఇబ్బందిపడటానికి కారణాలు ఏంటి.? ఆకాశంలో అద్భుత విన్యాసాలు చేసిన సుకోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానాలు.. చక్కర్లుకొడుతూ ఔరా అనిపించిన హెలికాప్టర్లు.. శత్రువుకు దడపుట్టించేలా రాజసంతో కదలివచ్చిన బ్యాటిల్ ట్యాంక్‌లు.. ఇవి రిపబ్లిక్‌డే పరేడ్‌లో దృశ్యాలు. దేశ ఆయుధ సంపత్తి, బలాన్ని చూసి ప్రజలు, నేతలు చప్పట్లుకొడుతూ కేరింతలు కొడుతే.. ఒకాయన మాత్రం ఇబ్బందిగా ఫీలయ్యారు. ఆయనే ముఖ్యఅతిథిగా వచ్చేసిన ఒబామా. కారణం ఆయుధాలన్నీ రష్యన్‌ మేడ్‌ కావడమే.. అమెరికా-రష్యా మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు. ఒకరికిని ఒకరు దెబ్బతీసుకోవడానికి చేయని ప్రయత్నాలు లేవు. ప్రపంచాన్ని రెండు కూటములుగా విభజించి రక్త రాజకీయాలు చేశాయి ఈ రెండు దేశాలు.

ఇప్పుడు రష్యా ఆర్థికంగా పతనమైపోయినా.. అంతరంగికంగా మాత్రం కోల్డ్‌వార్‌ జరుగుతూనే ఉంది. రష్యాను ఇబ్బందిపెట్టడానికి అమెరికా.. ఉక్రెయిన్‌ లాంటి దేశాలను వాడుకుంటుంటే.. అమెరికాను ఎదుర్కోవడానికి చైనాతో జతకడుతోంది రష్యా. ఈ నేపథ్యంలో పరేడ్‌లో అధికంగా రష్యాన్‌ మేడ్‌ ఆయుధాలనే ప్రదర్శించడంతో ఒబామా ఇబ్బందిపడ్డారు. ముందురోజే రష్యాపై విమర్శలు గుప్పించిన ఆయన.. ఆ తర్వాత రోజు రష్యా ఆయుధాలను తిలకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒబామా సంగతి ఎలా ఉన్నా అమెరికా పత్రికలు మాత్రం దీనిపై విమర్శలు గుప్పిస్తూ కథనాలు రాశాయి. పైకి అమెరికాతో మైత్రి అంటున్నా.. అంతరంగింకంగా రష్యాతో భారత్‌ చెలిమి ప్రత్యక్షంగా కనిపించిందని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాలు రాసింది. రష్యాతో భారత్‌కు ఎంతో సుదీర్ఘ స్నేహం ఉందో పరేడ్‌లో స్పష్టమైందని వివరించింది. దీనిపై అమెరికా జాతీయ భద్రతాసలహాదారుడు బెన్‌ రోడ్స్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

పరేడ్‌లో రష్యా మిలటరీ ఆయుధాలను చూడలేక ఒబామా ఇబ్బందిపడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని పత్రికలు మాత్రం దీన్ని రెండు కోణాల్లో వివరించాయి. గతంలో భారత్‌.. రష్యాతో స్నేహాన్ని కొనసాగించినా.. అత్యాధునిక ఆయుధాల ప్రదర్శనలో అన్నీ అమెరికావే ఉండటం కొత్త స్నేహాన్ని గుర్తుచేస్తున్నాయని వివరించాయి. పరేడ్‌లో ప్రదర్శించిన సీ-130జే సూపర్‌ హెర్క్యూలస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాప్ట్‌, సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ ఎయిర్‌క్రాప్ట్‌, పీ-8ఐ మెరైన్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాప్ట్‌లు అమెరికా నుంచి కొనుగోలు చేసినవే. మొత్తంగా పరేడ్‌లో ప్రదర్శించిన ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా హాట్‌హాట్‌ చర్చ జరుగుతోంది.

.

మరింత సమాచారం తెలుసుకోండి: