తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి దివంగత వెంకటరమణ భార్య సుగుణమ్మను ఏకగ్రీవంగా ఎంపిక చేయడానికి కాంగ్రెస్‌ అధిష్టానంతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుగుదేశంపార్టీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్టమ్మ నాయుడు తెలిపారు. బుధవారం ఎన్‌టిఆర్‌ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసినమీడియా సమావేశంలో గాలి ముద్దుకృష్టమ్మ నాయుడు మాట్లాడారు. వైకాపా పోటీ నుంచి తప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌పార్టీ కూడ తన అభ్యర్ధిని ఉపసంహారించు కోవాలని కోరారు. ఆర్‌కేబీచ్‌,కురుమర్‌ జలాంతర్గామి మ్యూజియం ప్రాంతంలో జగన్‌ సందర్శించి చంద్రబాబుపై విమర్శలు చేయడం సరైనది కాదన్నారు. ఏడు నెలల పాలనలో అద్భుతాలు ఎలా జరుగుతాయని జగన్‌ ఎలా ఊహిస్తారని ముద్దు కృష్టమ్మ నాయుడు ఎదురు ప్రశ్నవేశారు. కోతకు గురైన ప్రాంత అభివృద్ది కోసం రూ300 కోట్ల నిధుల విడుదల చేశామని, వాటి నిర్మాణపు పనులు తొందర్లో మెదలవుతాయని వివరించారు. పనులు మొదలు కాకమునుపే జగన్‌ నామినేషన్‌తో నాలుగురాళ్లు వేసి తెలుగుతమ్ముళ్లు జేబులు నింపుకోవడానికి ప్రయత్నిస్తు న్నారని విమర్శలు చేయడం తగదన్నారు. జగన్‌ పార్లమెంట్‌ సభ్యుడుగా ఉన్నసమయంలోను కాకినాడ, విశాఖపట్టణం లోను సునామీ వచ్చి పోయినప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేలేదని ప్రశ్నించారు. తిరుమలలో హెరిటేజ్‌ పార్లర్‌ను పునర్‌ నిర్మించడమే తప్ప కొత్తగా పెట్టింది కాదన్నారు. గతంలో కరుణాకర్‌రెడ్డి చైర్మన్‌గా జెఈవో ధర్మారెడ్డిలు కలసి హెరిటేజ్‌ని ఇక్కడ నుంచి తొలగించారని, మళ్లీ నిబంధనల మేరకు పునరుద్దరించారని గాలి ముద్దుకృష్ణమ్మ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: