ఎపి తెలంగాణ ప్రభుత్వాలకు వాస్తు గోల బాగా పెరిగిపోయింది. తెలంగాణ ప్రభుత్వం సచివాలయానికి వాస్తు దోషం ఉందని, అందుకే దానిని ఎర్రగడ్డ కు మార్చాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపాదించారని టిఆర్ఎస్ అదికారిక చానల్ కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించింది.

ఇంతకాలం ఉమ్మడి ఎపి కి సచివాలయంలగా ఉన్న ప్రదేశం అంతా వాస్తు లోపాలతో ఉందని, అష్టావక్ర సచివాలయమని వ్యాఖ్యానించింది.అందువల్లనే రాష్ట్ర విభజన వరకు పరిస్థితి వెళ్లిందని తేల్చింది.ఇక్కడ సచివాలయానికి రెండువైపులా వీధి పోటు ఉందని పేర్కొంది.

నిజాం కట్టిన జి.బ్లాక్ వద్ద రాకాసి బల్లి కనిపింంచడంతో ప్రభువు అక్కడ ఉండడానికి అప్పట్లో ఉండడానికి ఇష్టపడలేదని కూడా పేర్కొన్నారు.

ఇక ఎపి ప్రభుత్వం కూడా మంగళగిరి వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన తాత్కాలిక సచివాలయానికి వాస్తు దోషం ఉందని గమనించి ,మరో ప్రైవేటు భూమిని తీసుకున్నారు. ఎపి సచివాలయంలో ముఖ్యమంత్రి చాంబర్ పేరుతో రెండుసార్లు మార్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: