తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో విధంగా "హెరిటేజ్ డైరీ'' కూడా రాజకీయాంశం అవుతోంది. ఈ కంపెనీ వ్యవహారాల ను ప్రతిపక్షాల వాళ్లు రాజకీయాలోకి లాగుతున్నారు. ఈ కంపెనీలో మెజారిటీ వాటా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబానిది కావడంతో రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి.

మరి ఈ విమర్శలను ఎదుర్కోవడానికి హెరిటేజ్ సంస్థ కూడా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. రాజకీయ విమర్శలకు ఆ డైరీ ప్రోడక్ట్స్ సంస్థ సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే హెరిటేజ్ కన్నా ముందు ఈ రాజకీయ విమర్శలపై ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచే సమాధానాలు వస్తున్నాయి. కొంతమంది టీడీపీ నేతలు ప్రతిదినం సాక్షి పేపర్ చూసి.. హెరిటేజ్ పై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పడానికే బద్ధులై ఉన్నట్టుగా ఉన్నారు.

తిరుమలలో హెరిటేజ్ దుఖానం తెరవడం.. దీనికి అధికారులు ఆగమేఘాల మీద గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. అంతకన్నా ముందే పాలలో కల్తీ వ్యవహారాల్లో హెరిటేజ్ వివాదాల మధ్య చిక్కింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ వివరణ ఇచ్చుకోక ముందే కొంతమంది టీడీపీ నేతలు వకాల్తాపుచ్చుకొన్నారు. హెరిటేజ్ సర్వోత్తమ సంస్థ అని స్పష్టం చేశారు.

మరి ఇదంతా అధినేత ఆదరణ చూరగొనడానికేనని వేరే చెప్పనక్కర్లేదు. హెరిటీజ్ తరపున గట్టిగా మాట్లాడితే బాబు బాగా చూసుకొంటాడనేది వారి నమ్మకం లా ఉంది. అయితే ఈ ప్రయత్నాల్లో వారు టీడీపీ నేతలో.. హెరిటేజ్ ఉద్యోగులో.. అనే సందేహం వస్తుంది. అయినా.. ఈ రెండింటిలో ఏ హోదాలో ఉన్నా ఒకటే కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: