రాజధాని నిర్మాణంకోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేప ట్టిన భూసమీకరణకు విఘాతం కలిగేట్లున్నది. భూసమీకరణను వ్యతిరేకిస్తూ వందలా ది మంది రైతులు త్వరలో న్యాయస్ధానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇం దులో భాగంగానే ముందు తమ అభ్యంతరాలను శుక్రవారం పెనుమాక గ్రామంలో సమీకరణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న డిప్యూటి కలెక్టర్‌ జి. రఘునాధరెడ్డి ముందు దాఖలు చేశారు. క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సిఆర్‌డిఎ) బిల్లును శా సనసభలో ప్రవేశపట్టేపుడే భూసమీకరణపై రైతులు తమ అభ్యంతరాలను తెలియజే సేందుకు ప్రభుత్వం 30రోజులు గడువు ఇచ్చింది. బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందగానే గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లోనూ భూసమీకరణకు ప్రభు త్వం నడుంబిగించింది. ఇందుకోసమే ప్రతీ గ్రామానికి ఒక డిప్యూటి కలెక్టర్‌ను ప్రభుత్వం నియమించింది. భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయటం, రైతుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయటమే డిప్యూటి కలెక్టర్ల పని. అయితే, గ్రామానికి ఒక డిప్యూటి కలెక్టర్‌ను నియ మించినా, వివిధ కారణాల వల్ల భూసమీకరణ ప్రక్రియ అనుకున్నంతగా ముందుకు సాగటం లేదు.

ప్రభుత్వం ప్రకటనల మేరకే శుక్రవారానికి సుమారు 8500 ఎక రాల సమీకరణ సాధ్యమైంది. ప్రభుత్వం చేపట్టిన భూస మీకరణ విషయంలో మొత్తం 29 గ్రామాల్లో దాదాపు 10 గ్రామాల్లోని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన గ్రామాల్లోని రైతుల్లో మెజారిటీ భూములు ఇవ్వటానికి ముందుకు వచ్చారు. 19 గ్రామాల్లో కూడా సమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులున్నప్పటికీ వారి సంఖ్య తాక్కువే. అందుకనే రైతుల్లో భూసమీకరణకు అణుగుణంగా రైతుల్లో చైతన్యం తీసుకురావటానికి మంత్రులు, ఎంఎల్‌ ఏలతో పాటు ఉన్నతాధికారులు కూడా పలు సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ వ్యతిరేకిస్తున్న గ్రామాల జోలికి మాత్రం వెళ్లలేదు. భూసమీకరణకు వ్యతిరేకంగా పెను మాక, వుండవల్లి, ఎర్రుబాలెం, నిడమూరు, వెంకటాపా లెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెంతో పాటు మరో రెండు గ్రామాల రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయినా, వీరి ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోకుం డా ఒక్కో గ్రామంలో భూసమీకరణను ఆరంభించింది. అందులో భాగంగానే అధికారులు శుక్రవారం పెనుమాక గ్రామానికి వచ్చినపుడు రైతులందరూ వ్యతిరేకించారు. అంతేకాకుండా భూసమీకరణను వ్యతిరేకిస్తూ, డిప్యూటి కలెక్టర్‌ జి. రఘునాధరెడ్డికి తమ అభ్యంతరాలను రాతపూ ర్వకంగా అందచేశారు.

ప్రభుత్వం పేర్కొన్న విధంగానే సం బంధిత దరఖాస్తులను పూరించి అందుకు తమ అభ్యంత రాలను కూడా విడివిడిగా జత చేసి డిప్యూటి కలెక్టర్‌కు అందచేశారు. భూసమీకరణపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దరఖాస్తులను అందివ్వటం ఇదే ప్రధమం. పెను మాక గ్రామానికి చెందిన సుమారు 300 మంది రైతులు తమ అభ్యంతరాలను అందచేసినట్లు సమాచారం. వీరితో పాటు పైన పేర్కొన్న గ్రామాల్లోని రైతులు కూడా ప్రభుత్వం నుండి అభ్యంతరాలను తెలపటానికి నిర్దేశిత దరఖాస్తుల ను తీసుకున్నట్లు సమాచారం. వీరంతా మరో మూడు, నాలుగు రోజుల్లో తమ అభ్యంతరాలను చెప్పటానికి సిద్ద పడుతున్నట్లు తెలిసింది. సిఆర్‌డిఎ చట్టంలో పేర్కొన్న ట్లుగా ప్రభుత్వం నుండి తమకు సంతృప్తికరమైన లబ్ది అందుతుందన్న నమ్మకం లేదని పెనుమాక గ్రామస్తులు పేర్కొన్నట్లు సమాచారం. భూసమీకరణ తర్వాత ప్రభు త్వం పేర్కొన్నట్లుగా అభివృద్ది చేసిన భూమిని తమకు ఇస్తుందన్న నమ్మకం లేదని, నమ్మకం కలిగేట్లుగా ప్రభు త్వం ఎటువంటి విధానాలను పాటించలేదని కూడా వీరు పేర్కొనటం గమనార్హం. ఏడాదికి మూడు పంటలు పండే సుక్షేత్రమైన, సార వంతమైన తమ భూములను ప్రభు త్వం తీసుకుని తమకు ఇస్తామని చెబుతున్న ప్రతిఫలం తమకు ఎట్టిపరిస్దితుల్లోనూ ఆమోదయోగ్యంకాదని కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తమ భూమలు తీసుకు న్నందుకు ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న ప్రతిఫలం తమ భవిష్యత్తుకు ఏ విధంగానూ భరోసా ఇవ్వదని కూడా వీరు అనుమానిస్తున్నారు.

ప్రభుత్వం సిఆర్‌డిఎ చట్టంలో పేర్కొన్నట్లుగానే తమ అభ్యంతరాలను వ్యక్తంచేశామని, అయితే, సిఆర్‌డిఎ ఉన్నతాధికారులు ఏమి చేస్తారో చూడాలని అంటున్నారు. భూసమీకరణను వ్యతిరేకిస్తున్న పై గ్రామాల్లో సుమారు 8 వేల ఎకరాలున్నాయి. మరి ఈ గ్రామాలను వదిలిపెట్టి మిగిలిన గ్రామాల్లో సమీకరించిన భూములతోనే ప్రభుత్వం ముందుకు సాగుతుందా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకమే. భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతుల తరపున ఎం. శేషగిరి మాట్లాడుతూ, ప్రస్తుతానికి 300 అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో మిగిలిన రైతులు కూడా అభ్యంతరాలను వ్యక్తం చేయనున్నట్లు చెప్పారు. వీరందరూ దాఖలు చేసిన అభ్యంతరాల పట్ల సిఆర్‌డిఎ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలన్నారు. సిఆర్‌డిఎ పరిధిలో తమకు న్యాయం జరగకపోతే న్యాయస్ధానాన్ని ఆశ్రయించే విషయం కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ పర్యవరణ వేత్త, సామాజిక ఉద్యమ కారిణి మేథాపట్కర్‌ ఆధ్వర్యంలోని సంస్ధ తరపున మొత్తం 29 గ్రామాల్లోనూ ఒక నిజని ర్ధారణ కమిటీ పర్యటించింది. ఈ కమిటీ నివేదిక ఆధారం గా ఢిల్లీలోని సుప్రింకోర్టు ప్రముఖ న్యాయవాదుల్లో ఒక రైన ప్రశాంత్‌ భూషణ్‌తో కమిటీ సభ్యులు సంప్రదిస్తు న్నారు. సిఆర్‌డిఎ స్పందనను బట్టి తదుపరి నిర్ణయం తీసు కోవాలని రైతులు వేచిచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: