ఢిల్లీ పీఠానికి జరుగుతున్న పోటీ రసవత్తరంగా మారింది. అటు బీజేపీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ జరుగుతోంది. అవ్వన్నీ అటుంచితే.. నేనేం తక్కువా? అంటూ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన కందుకూరి సునీల్ కుమార్ అనేవ్యక్తి నేరుగా కేజ్రీవాల్‌పై పోటీకి దిగాడు. జెయన్‌టియూలో బీటెక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సునీల్‌కుమార్ 12,000 ఓటర్లున్న ఢిల్లీ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడున్న తెలుగు, దక్షిణాది ఓటర్ల‌తో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు.

ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ స్థానం కోసం ఆప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి కిరణ్‌వాలీ, బీజెపీ నుంచి నూపుర్‌శర్మ, యన్‌సీపీ తరపున రవికుమార్, బియస్పీ అభ్యర్ధిగా రాకేష్ కుమార్, ఇవికాకుండా అయిదు రిజిస్టర్డ్ పార్టీలకు చెందిన మొత్తం పదమూడు మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

సునీల్ కుమార్‌తో కలపి ముగ్గురు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాలెం సునీల్ స్వస్థలం. తండ్రి బాలకోటేశ్వరరావుకు ఏపీభవన్ లో పే అండ్ అక్కౌంట్స్ అధికారిగా ఉద్యోగం రావడంతో కుటుంబం పదిహేనేళ్ళ కిందటే ఢిల్లీకి షిఫ్ట్ అయ్యంది.

ఈ నియోజకవర్గంలోవున్న ఓటర్లలో 12 వేల మంది తెలుగు వారుండటంతో ఈ స్థానం మీద తెలుగు వారి కన్నుపడింది. దీంతో అక్కడున్న అనేకమంది సీనియుర్లు టిక్కెట్ కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను కలిసినా వాళ్లు నిరాకరించారనీ.. అందుకే తెలుగువాళ్ల పవర్ చూపించేందుకు పోటీకి దిగానంటన్నాడు సునీల్ కుమార్i

మరింత సమాచారం తెలుసుకోండి: