సీఎన్ఎన్ – ఐబీఎన్ ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ పోటీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని అమిత్ షా, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సత్యనాదెళ్ల, సానియామీర్జా వంటి ఎందరో ప్రముఖులను కాదని ఏకంగా 31 శాతం ఓట్లతో ముందంజలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకోనున్న కేసీఆర్ సీఎన్ఎన్ – ఐబీఎన్ వైస్ చైర్మన్ అభినందనలు కూడా తెలిపారు. ఈ పోటీలో కేసీఆర్ కంటే 11 శాతం ఓట్లు వెనకబడి 20 శాతం ఓట్లతో కేరళ ఐపీఎస్ అధికారి విజయన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ రోజుతో ముగుస్తున్న ఈ పోటీలో అనూహ్యంగా ఒకే ఒక్క రోజులో 14 శాతం ఓట్లు తెచ్చుకుని కేసీఆర్ 30 శాతం ఓట్లకు తీసుకెళ్లి 34 శాతం ఓట్లతో విజయన్ ముందుకు వచ్చాడు.

నెల రోజులుగా సాగుతున్న ఈ పోటీలో మొదట విజయన్ 23 శాతం ఓట్లతో ఉండగా కేసీఆర్ 16 శాతం ఓట్లతో ఉన్నాడు. ఆ తరువాత కేసీఆర్ ముందుకు వెళ్లగా ఏ రోజు కూడా విజయన్ కేసీఆర్ కు పోటీ ఇస్తున్న పరిస్థితి కనిపించలేదు. అయితే అనూహ్యంగా ఒక్క రోజులోనే విజయన్ 14 శాతం ఓట్లు సాధించి కేసీఆర్ ను వెనక్కి నెట్టేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగుదేశం పార్టీ అనుకూల గ్రూపులు, విభాగాలలో కేసీఆర్ కు సమీపంలో ఉన్న విజయన్ కు ఓటేయాలని ప్రచారం సాగించడంతో పాటు .. ఆన్ లైన్ కాంటెస్ట్ ఓట్లను కొనుగోలు చేసి మరీ విజయన్ కు వేయిస్తున్నట్లు బయటకు రావడంతో తెలంగాణ వాదులంతా కేసీఆర్ కు ఓట్లు వేయడం మొదలు పెట్టారు.

ఒక నెటిజెన్ ఎన్ని ఓట్లయినా వేసే అవకాశం ఉండడంతో అందరూ ఇదే పనిలో పడ్డారు. అయితే ఆన్ లైన్ ఓట్లు కొనుగోలు చేసి మరీ విజయన్ కు వేయిస్తుండడంతో కేసీఆర్ కు పడుతున్న ఓట్లు విజయన్ ను ఓడించే స్థాయికి వెళ్లడం లేదు.

వాస్తవంగా అయితే కేసీఆర్ కు వ్యతిరేకంగా టీడీపీ ఓట్లు వేయిస్తున్నందున సత్య నాదెళ్లలో, తమ మిత్రపక్షానికి చెందిన పార్టీ అధినేత అమిత్ షాకో, కాశ్మీర్ వరదల్లో ప్రజలకు విశేష సేవలు అందించిన ఇండియన్ ఆర్మీకో, లేకుంటే ఆఖరికి భారత హాకీ జట్టుకో వేయించవచ్చు. కానీ వీరెవరు కేసీఆర్ దరిదాపులలో లేనందున విజయన్ తో అయితే కేసీఆర్ ను ఓడించగలం అని భావించి పార్టీ శ్రేణులతో పాటు, కొనుగోలు చేసిన ఓట్లు ఐపీఎస్ అదికారి విజయన్ కు వేయిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ 30 శాతం ఓట్ల వద్ద ఉండగా విజయన్ ఏకంగా 35 శాతం ఓట్లతో ముందుకెళ్లడం గమనార్హం. మొత్తానికి చంద్రబాబు ఇక్కడ కూడా తన హై టెక్కు తెలివిని ఉపయోగించాడు అని అనుకోవాలేమో !!

మరింత సమాచారం తెలుసుకోండి: