చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్లి మారం చేస్తే వాళ్లకు బొమ్మలు ఇచ్చి..అటూ ఇటూ తిప్పుతూ బుజ్జగించి మరీ పాఠాలు చెబుతారు.. కానీ ఈ టీచరమ్మ ఏకంగా బట్టలు విప్పి మరీ శరీర అవయవాలు ఎలా ఉంటాయో చూపించి పిల్లలకు షాక్ ఇచ్చింది.. వివరాల్లోకి వెళితే.. నెదర్లాండ్స్ లో డెబ్బీ హీర్కేన్స్ అనే టీచర్ పిల్లలకు క్రియేటివ్ గా లెసన్ చెప్పాలనుకుంది..అంతే మనిషి శరీరం లోపలి పార్ట్స్ ఎలా ఉంటాయో చూపే బొమ్మలతో డిజైన్ చేసిన ఓ డ్రెస్ ను ఆ టీచర్ వేసుకొచ్చింది.


టీచర్ బట్టలు విప్పేస్తోంటే పిల్లలు షాక్ అయ్యారు, కాని లోపల తమ లెస్సన్ కి సంబంధించిన బొమ్మలతో ఉన్న టీచర్ డ్రెస్ చూసి పిల్లలు, తమ టీచర్ క్రియేటివిటి కి ఫిదా అయ్యారు.పిల్లలు చదివిన దానికన్నా చూసిన దాన్ని ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. అందుకే ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూములు,  వీడియో పాఠాలు వచ్చేసాయి. ఓ బయాలజీ టీచర్ వీటన్నిటికన్నా ఇంకా బాగా పిల్లలకి అర్థం అయ్యేలా లెసన్స్ చెప్పాలని అనుకుంది.


క్లాస్ రూమ్ లో బట్టలు విప్పి క్లాస్ తీసుకుంటున్న టీచర్


మానవ అవయవాల గురించి స్పష్టంగా, పిల్లలందరికీ అర్థం అయ్యేలా చెప్పిన ఆ టీచర్, తర్వాత అది కూడా తీసేసింది. ఈ సారి ఆ డ్రెస్ లోపల మనిషి అస్థిపంజరం బొమ్మ ఉన్న డ్రెస్ ఉంది. అప్పుడు మనిషి ఎముకల నిర్మాణం గురించి పిల్లలకి చెప్పింది.  తమ టీచర్ క్రియేటివిటి కి ఫిదా అయ్యారు. మానవ అవయవాల గురించి స్పష్టంగా, పిల్లలందరికీ అర్థం అయ్యేలా చెప్పిన అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది..ఇప్పటికి 27 లక్షల మంది చూసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: