గత వారం రోజుల నుంచి ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దీక్ష చేస్తున్నారు.. అయితే ఈ దీక్షపై స్పందించాల్సిన ప్రభుత్వం విమర్శలకు దిగింది..జగన్ దీక్ష బోగస్ అంటూ ఎదురుదాడికి దిగారు. అయితే ప్రజాపక్షాన నిలిచే తమ పార్టీ ఇవేవీ పట్టించుకోదని నేను చనిపోయినా దీక్ష మాననూ అంటూ వైఎస్ జగన్ దీక్ష కంటిన్యూ చేశారు.. దీంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది..ప్రాణాపాయ పరిస్థితిలో వెళ్లే పరిస్థితి కనిపించడంతో.. వెంటనే పోలీసులు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక దీక్షను మంగళవారం తెల్లవారు జామున పోలీసులు భగ్నం చేశారు.


పోలీసులు ఉదయం 4 గంటలకు దీక్షాస్థిలికి చేరుకున్నారు. కాసేపు జగన్‌తో మాట్లాడిన తర్వాత ఉదయం 4.11 గంటలకు దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా జగన్‌ను దీక్షాస్థలి నుంచి ఎత్తుకెళ్లి ఆస్పత్రికి చేర్చారు. ఇక్కడితో తమ పోరాటాన్ని ఆపేస్తామనుకుంటే అది వాళ్ల భ్రమ అని, టిడిపి ప్రభుత్వంపై తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు. జగన్ తన పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఏమీ అడగలేదని, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలనే ఏకైక ధ్యేయంతో దీక్ష చేస్తుంటే దానిపై ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా ఎలా చేశారో చూశామని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తాను దీక్ష విరమించబోనని, తన నిరాహార దీక్షను ఆపలేరని, శాంతియుతంగానే తాను దీక్ష చేస్తున్నానని ఆయన పోలీసులకు చెప్పారు.


ఇక జగన్ దీక్ష భగ్నం చేసిన ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడా అన్న అనుమానం కలుగుతుందని.. ప్రతిపక్ష హోదాలో ఉన్న ఓ నాయకుడు దీక్ష చేస్తుంటే కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేకుండా ఉన్నారని పైగా తమన మంత్రి వర్గంతో  జగన్‌ దీక్షపై  కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. అసలు చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయిందేమో అన్న అనుమానం వస్తుందని.. అప్రజాస్వామికమైన రీతిలో జగన్ దీక్షను భగ్నం చేశారని ఆమె ఆరోపించారు. . ప్రజల కనీసాసవరాలను పట్టించుకోకుండా మేకిన్ చైనా, జపాన్ అంటూ రాష్ట్ర ప్రజలను చంద్రబాబు అవమానిస్తున్నారని ఆమె అన్నారు.  


కార్యకర్తల ఆందోళన, వైఎస్ జగన్ కి చికిత్స చేస్తున్న వైద్యులు


ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ చేపట్టిన దీక్షపై మంత్రులు, ముఖ్యమంత్రి ఎలా ఎగతాళిగా మాట్లాడారో అంతా చూశామని, నిన్నటి వరకు అసలు దాన్ని పట్టించుకోనట్లున్నారని, తర్వాత దొంగ దారిన దీక్షను భగ్నం చేయాలని చూశారే తప్ప ఒక మంచి విషయం కోసం దీక్ష చేస్తుంటే కనీసం మంత్రులను పంపి చర్చలు జరిపించి, ప్రత్యేక హోదా తెప్పిస్తామనే హామీ కూడా ఇవ్వకుండా భగ్నం చేయడం సరి కాదని రోజా అన్నారు. ప్రతి పక్ష హోదాలో ఉన్న జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే ప్రజల స్పందన అద్భుతంగా ఉందని అది చూసి ఓర్వలేక భయంతో దీక్ష భగ్నం చేయించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: