ఆంద్రప్రదేశ్‌కు వరప్రసాదంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు భీషణ ప్రతిజ్ఞ చేసినప్పుడు చాలామంది నవ్వుకున్నారు. ఎందుకంటే అది ఆసాధ్యమని అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు ఈ సమస్య నుంచి బయటపడడానికి మరొక మార్గం ఎంచుకున్నారు. ఎలాగంటే పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని అమాంతంగా పెంచివేయడం ద్వారా. 2011లో పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 16 వేల కోట్లకు అంచనా వేయగా ఇప్పుడు ముఖ్యమంత్రి దాన్ని రూ. 36 వేల కోట్లకు పెంచేశారు.


ద్రవ్యోల్బణం, పునరావాస చర్యల కారణంగానే ప్రాజెక్టు వ్యయాన్ని పెంచాల్సి వచ్చిందని సాగునీటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రతిపత్తి కలిగించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లలో కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసింది. దీనికి తగిన కారణం కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్వహణను తనకు అప్పగిస్తే మొత్తం ఖర్చును తానే భరిస్తానని కేంద్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించినా నాయుడు ససేమిరా అంటూ తిరస్కరించారని వార్త. ప్రాజెక్టు నిర్వహణపై నియంత్రణను తమ వద్దే ఉంచుకుంటామని, కేంద్రానికి బిల్లులు మాత్రమే పంపిస్తామని బాబు స్పష్టం చేశారు.


దీంతో తాము డబ్బులు మంజూరు చేస్తే అది పూర్తిగా తెలుగుదేశం పార్టీ చేతుల్లోకే వెళుతుందని భావించిన కేంద్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వ్యయాలను చంద్రబాబు ఆ స్థాయిలో పెంచడం నమ్మశక్యం కావటం లేదు. కేవలం నాలుగే నాలుగు సంవత్సరాలలో ఒక ప్రాజెక్టు వ్యయం అంచనా 20 వేల కోట్లకు పెరుగుతుందా? ఇది కాంట్రాక్టర్లను బలిపించడానికి కాదా? కాంట్రాక్టర్లలో అత్యధికులు చంద్రబాబు కులానికి సంబంధించినవారు కాదా? పైగా పోలవరం ప్రాజెక్టుకు పెంచిన బడ్జెట్‌ను కేంద్రం మద్దతిచ్చే ప్రసక్తే లేదు.


దీన్ని బట్టి మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటి అంటే ఈ మొత్తం వ్యవహారంలో అవినీతి జడలు విచ్చుకుంది. ఆవిధంగా ఆంధ్ర్ర ప్రజల ప్రయోజనాలను తుంగలో తొక్కిన ఘనతను మరోసారి చంద్రబాబే తీసుకోబోతున్నాడన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: