తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తర్వాత ఏపీ రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ద పెట్టారు..ప్రపంచం గర్వించదగ్గ రాజధాని ఏర్పాటు చేయాలని ధృఢ సంకల్పంతో ఉన్నారు..ఇప్పటికే రాజధాని పేరు ‘అమరావతి’ అని నిర్ణయించారు. ఆ మద్య ఆంద్రప్రదేశ్ రాజదాని అమరావతికి సబందించి ఊహాచిత్రాలను ప్రభుత్వం విడుదల చేశారు. కొత్త గా నిర్మించ బోయే రాజధానిలా చాలా ప్రత్యేకతలు ఉంటాయని బాబు చెబుతున్నారు. అరవై లక్షల మందికి నివాసానికి అనువుగా ఉండేలా ఈ ప్రణాళిక సిద్దం చేసినట్లు చెబుతున్నారు.


మరో వైపు అమరావతి ప్రారంభ వేడుక అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు..ఇందుకోసం తెలుగు ఇండస్ట్రీలో సినీ ప్రముఖులతో కూడా చర్చలు కొనసాగుతున్నాయట..వేడుకకు రాజీకీయ,సినీ,పారిశ్రామిక వేత్తలు హజరు కాబోతున్న సందర్భంలో కలర్ ఫుల్ గా కనిపించడానికి ఏమేం చేయొచ్చో సినీ దిగ్గజాల  దగ్గర సలహాలు తీసుకుంటున్నారు చంద్రబాబు. ఇక ముఖ్య అతిథిగా భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడిని ఆహ్వానించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించారు.

మొన్న ఆదివారం తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేసి శంకుస్థాపనకు తప్పకుండా రావాలని ఆహ్వానించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ కూడా శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని చెప్పారు. దీనికి సంబంధించి కేసీఆర్ ఎలా వెళ్లాలో రూట్ మ్యాప్ కూడా తెలుసుకున్నారట.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

kcr

దీనిలో భాగంగానే తాను సూర్యాపేట నుండి రోడ్డు మార్గంలో అమరావతికి వస్తానని చంద్రబాబుకు చెబితే.. దీనికి చంద్రబాబు రోడ్డు మార్గంలో వద్దు.. హెలికాప్టర్ లో వస్తే బావుంటుందని సూచించే సరికి కేసీఆర్ కూడా అందుకు అంగీకరించారట.ఎల్లుండి ఉదయం 10.30 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అమరావతికి వెళ్తారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు కేసీఆర్ సూర్యాపేటకు చేరుకుంటారు. అదే రోజు సూర్యాపేటలో పలు అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: