ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రముఖులలో ఒకరు. పైగా రాజకీయ నేత, వీటికి తోడు రాష్ట్ర్రంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలలో ఆయన ఒకరు. తాను ఏ వ్యాపారం మొదలెట్టినా తన కులం వాళ్లకు మాత్రం తన వెంచర్లలో చదరపు అడుగుకు వంద రూపాయల మేరకు తగ్గించి వసూలు చేసే అలవాటు ఉందీయనకు. ఇప్పుడీయనకు లడ్డూలాంటి అవకాశం రాజధాని రూపంలో దొరికింది. 

అమరావతి సమీపంలో అత్యత భారీ నిర్మాణాల


అమరావతి సమీపంలో అత్యత భారీ నిర్మాణాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాల అనుమతులను ఈ ప్రముఖుడికి ఇప్పటికే అప్పగించేసింది. కొత్తరాజధాని పేరిట ఇటీవల జరుగుతున్న ప్రచారం పుణ్యమా అని అమరావతి సమీపంలో భవన నిర్మాణాలకు డిమాండ్ ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయింది. అక్కడ కట్టనున్న భవనాలపై కన్నేసిన ఈ ప్రముఖుడి కులానికి చెందిన అమెరికన్ ఎన్నారైలు తమకు భారీ రాయితీలు ఇవ్వాల్సిందిగా ఈయనగారిపై ఒత్తిడి చేస్తున్నారట. 


దీనికోసం అమెరికాలో తమ ఆధిపత్యంలో ఉన్న ఒక తెలుగు అసోసియేషన్ ద్వారా వీరు లాబీయింగ్ జరుపుతున్నారని వినికిడి. మరి వారి డిమాండుకు ఈయన తలొగ్గుతాడా? ఎందుకు తలొగ్గడు మరీ. ఏదేమైనా కొత్త రాజధాని అంటే ప్రధానంగా వారి కులానిదే హవా కదా ఇప్పుడు. హైదరాబాద్‌ను తాము కోల్పోయామని ఇప్పటికీ ఆంధ్ర వాళ్లు బాధపుడుతూనే ఉన్నారు. అలాంటిది రాష్ట్ర విభజన సైతం ఈ కమ్యూనిటీకే వరంలాగా మారనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: