ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, సిబ్బంది అహర్నిశలూ పనిచేసి వేదికను ఇతర పనులనూ పూర్తి చేశారు. ఏపీ బీజేపీ అధినేతతో సహా పదిమంది పెద్ద నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖులందరికీ ఆహ్వాన పత్రికలు వెళ్లాయి. 15 వేలమంది వీఐపీలు దేశ విదేశాల్లోంచి వస్తారని భావిస్తున్నారు.


కానీ ఒకే ఒక ప్రముఖుడికి మాత్రం ఆహ్వానం అందలేదట. అతడే జూనియర్ ఎన్టీఆర్. కేసీఆర్‌ను స్వయంగా చంద్రబాబు కలిసి ఆహ్వానించగా ఇతర టీడీపీ మంత్రులు హైదరాబాద్‌లో తెలంగాణ  మంత్రులకు, కాంగ్రెస్ నేతలకు, ఇతర ముఖ్యులకు ఆహ్వానాలు అందించి మరీ వచ్చారు. అందనిదల్లా ఒక్క ఎన్టీఆర్‌కు మాత్రమే ఇప్పుడు తను పెద్ద డైలెమ్మాలో పడ్డాడట. అమరావతికి వెళ్లాలా వద్దా? అని తల్లకిందులవుతున్నాడు కానీ కొంతమంది సహచరులు ఆ కార్యక్రమానికి హాజరయితేనే మంచిదని పోరుపెడుతున్నారట.


దీంతో ఆహ్వానం అందినా లేకున్నా, పిలిచినా పిలవకున్నా అమరావతికి వెళితేనే బాగుంటుందని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడని బోగట్టా. అయితే పిలవనిదే పేరంటానికి పోకూడన్నది మన పెద్దలు చెప్పిన మాట. ఎన్టీఆర్ అక్కడికి పోయి ఇంకెన్ని అవమానాల పాలై తిరిగొస్తాడో అని అందరూ అనుకుంటున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: