ప్రతి కంపెనీకి తనవైన మార్కెటింగ్ ఎత్తుగడలు తప్పక ఉంటాయి. సామాజిక సేవ చేస్తున్న మిషతో కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీలు నానా చావు తెలివితేటలూ ప్రదర్శిస్తాయనేది జగమెరిగన సత్యమే. కానీ చంద్రబాబులాగే ఆయన కంపెని హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివినట్లుంది. అమరావతి రూపంలో లడ్డూలా దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాడానికి హెరిటేజ్ వేగంగా పావులు కదిపింది.


ఈ రోజు అంటే అక్టోబర్ 22న ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకోసం తరలి రానున్న అశేష జనవాహిని దప్పిక తీర్చడానికి లక్షన్నర పైగా మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా అందజేయనున్నట్లు హెరిటేజ్ ప్రకటించింది. అయితే ఇది తాము చేస్తున్న సామాజిక సేవగా కంపెనీ టముకువాయించుకుంటున్నా దీనివెనుక మార్కెటింగ్ వ్యూహం కొట్టొచ్చినట్లు కనబడుతూనే ఉంది. కంపెనీ ప్రకటించినట్లుగా ఉచిత మజ్జిగ ప్యాకెట్లను అందిచే పేరుతో హెరిటేజ్ ఫుడ్స్ రాజధాని శంకుస్థాపన వేదిక వద్ద లెక్కకు మించిన స్టాళ్లను, భారీ బిల్ బోర్డులను, బ్యానర్లను ఏర్పరుస్తుందని చెప్పపనిలేదు. 

హెరిటేజ్ ఫుడ్ ఉత్పత్తులను అమ్ముతారని గ్యారంటీగా


కంపెనీ చెప్పుకుంటున్నట్లు మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా ఇస్తారేమో కానీ అక్కడ ఖచ్చితంగా ఇతర హెరిటేజ్ ఫుడ్ ఉత్పత్తులను అమ్ముతారని గ్యారంటీగా చెప్పవచ్చు. వ్యాపారాన్ని ఇటుక ఇటుక చొప్పును పేర్చి కట్టాలంటే ఇదే కదా మరి. వాస్తవానికి ఏదైనా ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఏ కంపెనీ అయినా తన హోర్డింగులను పెట్టాలంటే ప్రభుత్వం భారీ రుసుము వసూలు చేస్తుంది. కానీ సామాజిక సేవ పేరుతో వస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ నుంచి ప్రభుత్వం నయా పైసా కూడా వసూలు చేయదన్నది వాస్తవం. 


ఇంతకు మించిన పబ్లిసిటీ హెరిటేజ్‌ ఫుడ్స్‌కి మరొకటి ఉందా?



మరింత సమాచారం తెలుసుకోండి: