టైటిల్ చూసి కన్ ఫ్యూజ్ అయిపోకండి. మీరు చదివింది నిజమే. మరి ప్రభాస్ కు, కేసీఆర్ కు లింకేమిటనుకుంటున్నారా.. అదే హైదరాబాద్ పోలీసుల స్పెషాలిటీ. అసలు డ్యూటీ వదిలేసి ఎక్స్ ట్రా పనులపై దృష్టి పెట్టారు సీఎం సెక్యూరిటీగా ఉండాల్సిన పోలీసులు. 

అసలేంజరిగిందంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లేదారిలో పోలీసు బందోబస్తు ఉంటుందన్న సంగతి తెలిసిందే కదా.. జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో సీఎం కేసీఆర్ వెళ్లే రూట్లో కొందరు పోలీసులను బందోబస్తు కోసం పెట్టారు. మరికొద్దిసేపట్లో కేసీఆర్ కాన్వాయ్ వస్తుందని కూడా వారికి సమాచారం అందించారు. 

ఇంతలో సినీహీరో ప్రభాస్ ఇంటి దగ్గర సందడిగా ఉందని వారికి సమాచారం వచ్చింది. అభిమానులు బాహుబలి హీరోతో ఫోటోలు దిగేందుకు వస్తున్నారని వారికి తెలిసింది. అంతే కేసీఆర్ భద్రత సంగతి గాలికొదిలేసి ప్రభాస్ ఇంటికి పరుగులు  తీశారు. కనీసం ఉన్నతాధికారులకు సమాచారం కూడా ఇవ్వలేదు. 

ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఉన్నతాధికారులు వారిపై మండిపడ్డారు. వారి సంజాయిషీ తీసుకున్నారు. మొత్తం వివాదంపై నివేదిక కోరినట్టు తెలిసింది. మొత్తానికి ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉన్నట్టు లేదూ..


మరింత సమాచారం తెలుసుకోండి: