ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌నానంత‌రం తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇరు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న రాజ‌కీయ వాతావర‌ణం ఇంతా అంతా కాదు. ఒక‌నొక ద‌శ‌లో ఇరువురి సీఎంల మ‌ధ్య‌ దాయాది యుద్ధం జరిగింద‌నే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు క‌లిసిమెలిసి ఉన్నారే తప్పా,  ఇద్ద‌రి చంద్రుల మ‌ధ్య వార్ వ‌ల్ల‌ ఎలాంటి వ్య‌తిరేక భావం పెట్టుకోలేదు. ఇక ఇరువురు సీఎం లు క‌లిసి మెలిసి ఉంటేనే భాగుంటుంద‌ని భావించినా వారి క‌ల‌యిక కు అప్ప‌ట్లో జ‌ర‌గ‌లేదు. ఇక ఈ ఇద్ద‌రు చంద్రుల క‌ల‌యిక తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశంలో కూడా ఆస‌క్తి రేకెత్తించినా.. చివ‌ర‌కు తెర దించారు. న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా వెళ్లి కేసీఆర్ ను ఆహ్వానించ‌డం.. త ద్వారా కేసీఆర్ అమ‌రావ‌తి శంకు స్థాప‌న‌కు  వెళ్ల‌డం తో గ‌త కొద్ది రోజులుగా ఉత్కంఠ‌కు శుభం కార్డు ప‌డింది. అయితే.. తాజాగా టీటీడీపీ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా ఇదే మంత్రాన్ని అవ‌లంభించాల‌ని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి త‌న కూతురు నైమంశా వివాహం


తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి త‌న కూతురు నైమంశా వివాహం వ‌చ్చే నెల 21న జ‌ర‌గ‌నుంది. ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రం బీమ‌వ‌రం కు చెందిన జి. వెంక‌ట‌రెడ్డి కుమారుడు స‌త్య‌నారాయ‌ణ రెడ్డి తో జూన్ 11న నిశ్చితార్దం పుచ్చుకున్న సంగ‌తి విదిత‌మే. ఈ క్ర‌మంలో తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కే. చంద్ర‌శేఖ‌ర్ రావు ను ఈ వివాహా వేడుకకు ప్ర‌త్యేకంగా ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు స‌మాచారం. అయితే దీనికి సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. ఇక‌నొక ద‌శ‌లో ఇక అన‌వ‌స‌రంగా గొడ‌వ‌లు ఎందుకని భావించి సీఎం కేసీఆర్ వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదని తెలుగు ప్ర‌జ‌ల భావిస్తున్నారు. ఇది ఇలా ఉండ‌గా..  ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీడీపీ నేత రేవంత్ రెడ్డి కి మ‌ద్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గు మ‌న్న విష‌యం తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.


గ‌త కొన్ని నెల‌ల క్రితం ఓటుకు నోటు వ్య‌వ‌హారం లో టీఆర్ఎస్  నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ స‌న్ ను కొనుగోలు చేస్తు టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ఏసీబీ ల‌కు అడ్డంగా దొరికిన సంగ‌తి విదిత‌మే. ఈ వ్య‌వ‌హారంలో టీఆర్ఎస్ పార్టీ రాజ‌కీయ గేమ్ ఆడింద‌ని..అందులో రేవంత్ రెడ్డి బ‌ల‌య్యాడ‌న్న‌ది ఒపెన్ సిక్రెట్. అయితే ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకు ప‌డ్డాడు రేవంత్. మీసాలు మెలేసి మ‌రీ నీ అంతు చూస్తా కేసీఆర్.. అంటూ గ‌ట్టి వార్నింగ్ లే ఇచ్చారు. అప్ప‌టి నుంచి ఇరువురి మద్య ప్ర‌చ్చ‌న్న యుద్ద‌మే జరిగింది. ఈ క్ర‌మంలో రేవంత్ రెడ్డి రెండు నెల‌ల జైలు జీవితం అనుభ‌వించారు. కేసీఆర్ కావాల‌నే న‌న్ను అరెస్ట్  చేయించార‌ని చాలా సార్లు ఆరోపించారు. ఇక కేసీఆర్ ను గ‌ద్దే దించ‌డ‌మే నా ల‌క్ష్యం అని రేవంత్ ఆన్నారు. అయితే తాజా రైతు భ‌రోసా యాత్ర‌లో పాల్గోన్న రేవంత్ రెడ్డి ప్ర‌సంగిస్తూ.. వ‌చ్చే నెల‌లో నా కూతురు పెళ్లి అనంత‌రం కేసీఆర్ పెళ్లి చేస్తానని సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశారు. 


ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో అడ్డంగా బుక్కైన రేవంత్ అధికార టీఆర్ఎస్ పార్టీ తో ఢీ అంటే ఢీ అనుకుని.. ఇంకా శ‌త్రుత్వం కొన‌సాగిస్తున్నాడు. రాజ‌కీయంగా కాకుండా వ్య‌క్తిగ‌తంగా సైతం కేసీఆర్ ను టార్గెట్ చేసి మ‌రీ దూష‌ణలు చేశారు. కొన్ని సందర్భాల‌లో ఆయ‌న కేసీఆర్ పై అనుచిత్త వ్యాఖ్యలే చేశారు. ఈ వ్య‌వ‌హారంతో టీటీడీపీ కే ఎక్కువ న‌ష్టం క‌లిగింద‌ని చెప్పాలి. దీనిని గ‌మ‌నించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు.. రేవంత్ కు వ్య‌వ‌హారాన్ని మార్పు కోసం చాలా సార్లు ప్ర‌య‌త్నించారు. అయితే తాజా గా రేవంత్ కూడా రియ‌లైజ్ అయిన్న‌ట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి మొద‌ట్లో మండి ప‌డినా త‌రువాత బోధ‌ప‌డి తాను కేసీఆర్ తో విరోధం మానుకోవాల‌ని అనుకుంటున్నార‌ని సమాచారం. ఇక‌పోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంత‌రం ఇద్దరి చంద్రుల మ‌ధ్య భారీ మాట‌ల యుద్ధాలే కాకుండా కొన్ని సంద‌ర్బాల్లో క‌య్యానికి కాలు దువ్వినా.. వీరిద్ద‌రిని అమ‌రావ‌తి శంకు స్థాప‌న శుభ‌కార్యం క‌లిపింద‌నే చెప్పాలి. 


అంతేకాకుండా ఇరు రాష్ట్రాల సీఎం ల మ‌ధ్య వైరుధ్యాన్ని ప‌క్క‌న పెట్టి.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం క‌లిసి మెలిసి ముందుకు పోతామ‌ని బ‌హిరంగ వేదిక‌పై బాహటంగానే ప్ర‌క‌టించారు. మ‌రోవైపు... తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం కాస్తా సీఎం కేసీఆర్ కు సైతం త‌ల‌నొప్పిగా మారింద‌నే చెప్పాలి. కేసీఆర్ కు రేవంత్ వ్య‌వ‌హారం కాస్తా.. చెవిలో జోరిగలా మారింద‌ని భావ‌న‌లో కేసీఆర్ ఉన్నారు. ఇక‌ తాజాగా ఓటుకు నోటు వ్య‌వ‌హారం కూడా ఇద్ద‌రు చంద్రులు అట‌కెక్కించారు. అంతేకాకుండా.. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఇంకా క‌లిసి పంచుకోవాల‌సిన సమ‌స్య‌లు చాలానే ఉన్నాయి. ఈ క్ర‌మంతో ఇరు రాష్ట్రాల మ‌ద్య శ‌త్రుత్వం కూడా మంచిది కాద‌నే భావ‌న‌కు ఇరువురు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌హారంతో తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యింద‌న్న‌ది నిజం. ఇక తెలంగాణలో పార్టీ అభివృద్ది కూడా చంద్ర‌బాబు కు చాలా అవ‌స‌ర‌మ‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో రేవంత్ అదికార టీఆర్ఎస్ పై క‌క్ష పూరిత వ్య‌వ‌హారం పూర్తిగా ఆపాల‌ని బాబు రేవంత్ కు హిత‌బొధ చేసిన్న‌ట్టు తెలుస్తోంది.


అంతేకాకుండా రేవంత్ సైతం ఆధికార పార్టీతో ఇంకా శ‌త్రుత్వాలు కొన‌సాగించ‌కూడద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న కూతురు వివాహా వేదికగా స‌యోధ్య‌కు రానున్న‌ట్లు తెలుస్తోంది.  నేడో రేపో రేవంత్  సీఎం కేసీఆర్ ఆహ్వానం ఇవ్వ‌డానికి వెళ్లే అవ‌కాశం ఉంది. దీనికి కేసీఆర్ ఎలా  స్పందించ‌నున్నారోన‌న్న వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హల్ చ‌ల్ చేస్తోంది. అయితే గత ఏపీ రాజ‌ధాని వ్య‌వహారంలో చంద్ర‌బాబు ఆహ్వానాన్ని బ‌ట్టే స్పందించాల‌ని భావించిన కేసీఆర్ ఒక మంచి నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని తెలుగు ప్ర‌జ‌లు భావిస్తున్నారు. తాజా రేవంత్ విష‌యంలో కూడా ఇలాంటి నిర్ణ‌య‌మే తీసుకోనున్నారన్న వార్త‌లు గుప్పుమంటున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: